Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..30 September 2024

Today Horoscope In Telugu Daily Rashi Phalalu For Monday 30th September 2024
x

Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..30 September 2024

Highlights

Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..30 September 2024

30-09-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : త్రయోదశి రాత్రి గం.7.06 ని.ల వరకు ఆ తర్వాత చతుర్దశి

నక్షత్రం: మఖ ఉదయం గం.6.19 ని.ల వరకు ఆ తర్వాత పుబ్బ

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటిన తర్వాత గం.2.05 ని.ల నుంచి గం.3.52 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.3.18 ని.ల నుంచి గం.5.06 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.30 ని.ల నుంచి గం.1.18 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.54 ని.ల నుంచి గం.3.42 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.36 ని.ల నుంచి గం. 9.06 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.06 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.06 ని.లకు

మేషం :


పనుల్లో ఆటంకాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆలోచనలు సవ్యంగా సాగవు. అభీష్టం నెరవేరే అవకాశం లేదు. ఇతరులతో విరోధం వృద్ధి చెందుతుంది. విలువైన వస్తువు దొంగతనమయ్యే వీలుంది.

వృషభం :


భూ సంబంధ వ్యవహారాలు బెడిసికొడతాయి. డబ్బుకి ఇబ్బంది కలుగుతుంది. బుద్ధి స్థిరంగా ఉండదు. ఆత్మీయులతోనూ విరోధం గోచరిస్తోంది. సహచరులతోనే సమస్యలొస్తాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మిథునం :


ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు లాభసాటిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. మిత్రులు తోడుంటారు.

కర్కాటకం:


పని సవ్యంగా సాగదు. ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా బ్యాంకు వ్యవహారాలు చికాకు పెడతాయి. మనశ్శాంతి కరువవుతుంది. వేళకు భోజనం ఉండదు. స్థిరాస్తుల క్రయవిక్రయాలు వాయిదా వేయండి. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం :


వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. కార్యజయం ఉంది. డబ్బు సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. వాహన యోగం ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలు ఆనందపరుస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. కీర్తి పెరుగుతుంది.

కన్య :


పనులు సవ్యంగా సాగవు. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మిత్రవిరోధం గోచరిస్తోంది. వ్యర్థ ప్రయాణం మానుకోండి. బద్ధకాన్ని వదలాలి. కంటి సమస్యలుంటాయి. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.

తుల :


బంధాలు బలపడతాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్నిస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. మీకంటే పెద్దవారిని కలిసి సూచనలు స్వీకరిస్తారు. కొత్త వస్తువులను సమీకరిస్తారు.

వృశ్చికం :


స్థిర నిర్ణయంతో చేపట్టే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.

ధనుస్సు :


పనుల పూర్తిలో జాప్యం కలుగుతుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. త్వరగా అలసిపోతారు. ప్రత్యర్థులు పెరుగుతారు. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. సంప్రదాయిక జీవనంపై ఆసక్తి పెరుగుతుంది.

మకరం :


ఆటంకాలను దాటాల్సి వుంటుంది. అనుకోని కష్టాలు ఎదురవుతాయి. అభీష్టం నెరవేరదు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల కదలికలను గమనించండి. పైత్య సమస్యలుంటాయి.

కుంభం :


పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విందులో పాల్గొంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ప్రత్యర్థులపై గెలుపు సాధిస్తారు. ప్రయాణం లాభిస్తుంది. కీర్తి పెరుగుతుంది.

మీనం :


శుభ ఫలితాలు లభిస్తాయి. ధన సంబంధ చిక్కులు ఉండవు. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories