Telugu Horoscope Today 23 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Today Horoscope In Telugu Daily Rashi Phalalu For Monday 23 September 2024
x

Telugu Horoscope Today 23 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Highlights

Telugu Horoscope Today 23 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

23-09-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : షష్ఠి మధ్యాహ్నం గం.1.50 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి

నక్షత్రం: రోహిణి రాత్రి గం.10.07 ని.ల వరకు ఆ తర్వాత మృగశిర

అమృతఘడియలు: రాత్రి గం 7.02 ని.ల నుంచి గం.8.35 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.2.25 ని.ల నుంచి గం.3.58 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి దాటాక గం.3.40 ని.ల నుంచి గం.5.15 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.32 ని.ల నుంచి గం.1.21 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.58 ని.ల నుంచి గం.3.45 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.36 ని.ల నుంచి గం.9.07 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.05 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.11 ని.లకు

మేషం :


అనవసర జోక్యాల వల్ల సమస్యలు వస్తాయి. పనులు కూడా అనుకున్న రీతిలో సాగవు. బ్యాంకు లావాదేవీలు బెడిసికొట్టే వీలుంది. మనసుకి కష్టంగా ఉంటుంది. రెండో పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలొస్తాయి.

వృషభం :


తెలివితేటలతో పనులను సఫలం చేసుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. కీర్తి పెరుగుతుంది. విందుకు హాజరవుతారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.

మిథునం :


పనులు సవ్యంగా సాగవు. అనూహ్య ఖర్చులుంటాయి. ప్రయాణంలో నష్టం గోచరిస్తోంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి.

కర్కాటకం:


అభీష్టం నెరవేరుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఇష్టులతో విందులో పాల్గొంటారు. ఇంటి వ్యవహారాలను చక్కదిద్దుతారు. సంతానం తీరు సంతృప్తినిస్తుంది.

సింహం :


అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. వృత్తికి సంబంధించిన పురోభివృద్ధి ఉంటుంది. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. బంధువులతో వేడుకలో పాల్గొంటారు.

కన్య :


బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. సంతానం తీరు చికాకు పరుస్తుంది. త్వరగా అలసిపోతారు. వృథా ఖర్చులుంటాయి. దూర ప్రయాణం గోచరిస్తోంది. కీర్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

తుల :


పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా చికాకులూ పెరుగుతాయి. చెప్పుడు మాటల వల్ల అపోహలు పెరుగుతాయి. పై అధికారుల కోపానికి గురవుతారు.

వృశ్చికం :


జీవిత భాగస్వామి తోడ్పాటుతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తిగా సాగుతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఇతరులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

ధనుస్సు :


కార్యజయం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశించినట్లే సాగుతాయి. కొత్త వస్తువులను కొంటారు. కీర్తి పెరుగుతుంది. న్యాయ వివాదాలు పరిష్కారమవుతాయి. మిత్రులు తోడుంటారు. దైవ చింతన పెరుగుతుంది.

మకరం :


ప్రతి పనికీ ఆటంకాలుంటాయి. ఇష్ట కార్యం భంగమవుతుంది. మనసు కష్టపడుతుంది. అనవసర జోక్యాలు వద్దు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు తీసుకోండి. వృథా ఖర్చులుంటాయి. విలువైన వస్తువులు జాగ్రత్త.

కుంభం :


బుద్ధి స్థిరంగా ఉండదు. తొందరపాటు వల్ల నష్టపోతారు. డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. బంధువులతో విరోధం గోచరిస్తోంది. ఆలోచన విధానాన్ని సరిచేసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ప్రయాణాల్లో జాగ్రత్త.

మీనం :


పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు తృప్తిగా ఉంటాయి. అగ్రిమెంట్లకు అనుకూలం. రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులు తోడుంటారు. ముఖ్యమైన వార్త అందుతుంది. ప్రయాణం సూచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories