Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..4th october 2024

Today Horoscope In Telugu Daily Rashi Phalalu For Friday 4th October 2024
x

Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..4th october 2024

Highlights

Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..4th october 2024

04-10-2024 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి : విదియ రేపు తె.వా.గం.5.30 వరకు

నక్షత్రం: చిత్త సాయంత్రం గం.6.38 ని.ల వరకు ఆ తర్వాత స్వాతి

అమృతఘడియలు: ఉదయం గం.11.24 ని.ల నుంచి గం.మధ్యాహ్నం గం.1.13 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి గం.12.55 ని.ల నుంచి గం.2.42 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.37 ని.ల చి గం. 9.24 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.33 ని.ల నుంచి గం.1.20 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.41 ని.ల నుంచి గం.12.09 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.16 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.03 ని.లకు

మేషం :

ఆశించిన రీతిలోనే పనులు పూర్తవుతాయి. అన్ని రంగాల్లోని వారికి యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయాణ కారణం నెరవేరుతుంది.

వృషభం :

చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. కోరిక నెరవేరుతుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఉద్యోగులకు శుభవర్తమానం అందుతుంది. ప్రత్యర్థులపై గెలుపు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మిథునం :

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రత్యర్థులదే పైచేయి అవుతుంది. ఆర్థికంగానూ ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది. సంతాన వ్యవహారాలు చికాకు పరుస్తాయి. కీలక వ్యవహారాల్లో మిత్రుల సూచన తీసుకోండి.

కర్కాటకం:

ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తి విక్రయ వ్యవహారాల్లో తొందరపాటు తగదు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వాహన కొనుగోలు ఆలోచనలు పెద్దగా ఫలించవు. నదులు, కుంటల వద్ద జాగ్రత్త.

సింహం :

అభీష్టం నెరవేరుతుంది. దాయాదులతో సమస్య పరిష్కారమవుతుంది. తోబుట్టువుల సూచనతో కీలక వ్యవహారంలో గట్టెక్కుతారు. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. ప్రయాణం సూచిస్తోంది.

కన్య :

పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. బ్యాంకు లావాదేవీలు ఆశించినట్లు సాగవు. హామీ నిలుపుకోని కారణంగా మాట పడే సూచన ఉంది. కుటుంబ సభ్యుల తీరు చికాకు పరుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

తుల :

ఆశించిన ప్రయోజనాలు అందుతాయి. ధన సంబంధ లావాదేవీలు అనుకూలిస్తాయి. అదృష్టం వరిస్తుంది. దీర్ఘకాలంగా పెండింగులోని సమస్య పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది.

వృశ్చికం :

కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆత్మీయుల వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుంది. శత్రుపీడ పెరుగుతుంది. ఇంటికి దూరంగా ఉండే అవకాశముంది. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు :

ప్రతి ప్రయత్నమూ అనుకూల ఫలితాలనిస్తుంది. ధన సంబంధ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులు తోడుగా నిలుస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి.

మకరం :

ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. వృత్తిపరమైన జీవితం ఆనందంగా సాగుతుంది. అధికారుల మన్ననలను పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోండి.

కుంభం :

చేపట్టిన కార్యాల్లో ఆశించిన లబ్ది చేకూరదు. ప్రతి ప్రయత్నానికీ అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. ఉన్నత విద్య ప్రయత్నాలు అనుకూలించవు. దైవ చింతన పెరుగుతుంది.

మీనం :

పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వస్తుంది. కుటుంబ, శారీరక సౌఖ్యానికి దూరమయ్యే సూచన ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. జరుగుతున్న పరిణామాలు నిరాశను కలిగిస్తాయి. బద్ధకం వీడి కష్టపడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories