Telugu Horoscope Today 21st September 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 21st September 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా
x
Highlights

Telugu Horoscope Today 21st September 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

21-09-2024 (శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : చవితి సాయంత్రం గం.6.13 ని.ల వరకు ఆ తర్వాత పంచమి

నక్షత్రం: భరణి అర్ధరాత్రి గం.12.36 ని.ల వరకు ఆ తర్వాత కృత్తిక

అమృతఘడియలు: రాత్రి గం.8.13 ని.ల నుంచి గం.9.41 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.11.28 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.55 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.6.05 ని.ల నుంచి గం.7.42 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.9.07 ని.ల నుంచి గం. 10.38 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.05 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.13 ని.లకు

మేషం :


ప్రయత్నాలు సఫలమవుతాయి. జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి అనువైన రోజు. ఆకస్మిక ధనలాభం ఉంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తారు. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది.

వృషభం :


వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. మనసు కలతబారుతుంది. వేరే వ్యక్తులతో జాగ్రత్తగా మెలగండి. అనవసర ప్రయాణాలు వద్దు. అప్పు చేయాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదు. నిద్రలేమి వేధిస్తుంది.

మిథునం :


ఆకాంక్ష నెరవేరుతుంది. ప్రతిపనీ సఫలం అవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. స్పెక్యులేషన్స్ ఫలిస్తాయి. మేనమామ వల్ల లబ్దిని పొందుతారు. స్థలం కొనుగోలు యత్నాలు చేస్తారు. వినోద కార్యాల్లో పాల్గొంటారు.

కర్కాటకం:


పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. మనోనిగ్రహం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. మిత్రుల సమస్యలు పరిష్కరిస్తారు. కీర్తి పెరుగుతుంది.

సింహం :


పిత్రార్జిత ఆస్తి కోసం చేసే ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. గురువులను కలుస్తారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది.

కన్య :


నిర్దేశించుకున్న రీతిలో పనులు సాగవు. వారసత్వ సంపద గురించిన ప్రయత్నాలు అనుకూలించవు. శత్రు పీడ పెరుగుతుంది. తగాదాలకు దూరంగా ఉండండి. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

తుల :


పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. అంతర్గత ఆనందం వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ప్రయాణం లాభిస్తుంది.నిజాయితీకి గుర్తింపుంటుంది.

వృశ్చికం :


ఆశించిన పని పూర్తవుతుంది. అడ్డంకులను తేలిగ్గా దాటేస్తారు. ఆర్థిక లబ్ది ఉంది. బంధువులు తోడుగా ఉంటారు. అపార్థాలు తొలగిపోతాయి. పోటీల్లో గెలుస్తారు. కొత్త వస్తువులు కొంటారు. గౌరవం పెరుగుతుంది.

ధనుస్సు :


ప్రతి పనికీ అడ్డంకులొస్తాయి. బద్ధకం విడిచిపెట్టాలి. ఆలోచన తీరును సరిచేసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం తగదు. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుకోవాలి. వాత సంబంధసమస్యలొస్తాయి.

మకరం :


పని ఒత్తిడి పెరుగుతుంది. డబ్బుకీ ఇబ్బందిగా ఉంటుంది. స్థలం కొనే ప్రయత్నం ఫలించదు. బంధువిరోధం, అవమానం గోచరిస్తున్నాయి. ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. శ్వాస సంబంధ సమస్య రావచ్చు.

కుంభం :


నాయకత్వ పటిమను చూపుతారు. మీ సాహసోపేత నిర్ణయానికి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా విశేష లాభం ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. తోబుట్టువుల విషయాలపై శ్రద్ధ పెడతారు. మనశ్శాంతి లభిస్తుంది.

మీనం :


మనసులోని భావాన్ని సక్రమంగా చెప్పలేక పోతారు. అకారణ విరోధం వస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో నిజాయితీగానే ఉన్నా ముందు చూపు లేక నష్టపోతారు. అనవసర జోక్యం వద్దు. ఎవరికీ పూచీలు ఇవ్వకండి.

Show Full Article
Print Article
Next Story
More Stories