Horoscope Today in Telugu 10th September 2024: నోటిదురుసుతో చిక్కుల్లో పడే ఛాన్స్.. ఈ రాశి వారికి కష్టకాలమే..

Today Horoscope In Telugu Daily Rashi Phalalu For 10th September 2024 Tuesday In Telugu
x

Horoscope Today in Telugu 10th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Highlights

Horoscope Today in Telugu 10th September 2024: నోటిదురుసుతో చిక్కుల్లో పడే ఛాన్స్.. ఈ రాశి వారికి కష్టకాలమే..

రాశిఫలం 10-092024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : సప్తమి రాత్రి గం.11.11 ని.ల వరకు

నక్షత్రం: అనూరాధ రాత్రి గం.8.04 ని.ల వరకు ఆ తర్వాత జ్యేష్ట

అమృతఘడియలు: ఉదయం గం.8.48 ని.ల నుంచి గం.10.32 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి దాటాక గం.1.58 ని.ల నుంచి గం.3.39 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.31 ని.ల నుంచి గం.9.21 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.03 ని.ల నుంచి గం.11.50 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.18 ని.ల నుంచి గం.4.50 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.04 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.22 ని.లకు

మేషం : బలహీనత, మొహమాటాలను అధిగమించకుంటే ఇబ్బంది. పనులు సవ్యంగా సాగవు. ఆర్థిక పరంగానూ చిక్కులుంటాయి. తగాదాలకు ఆస్కారముంది. ఆచితూచి మాట్లాడండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

వృషభం : స్వేచ్ఛాజీవితంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక చిక్కులుండవు. శారీరక, మానసిక శాంతి లభిస్తుంది. ఇతరులతో సత్సంబంధాలుంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణం లాభిస్తుంది.

మిథునం : వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. ప్రతిష్ట పెరుగుతుంది. మనో వేదిన తీరుతుంది. పోటీల్లో ప్రత్యర్థులను ఓడిస్తారు. అపార్థాలు తొలగుతాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది.

కర్కాటకం: వృథా ఖర్చులుంటాయి. అవసరమైన వేళ మీ తెలివితేటలకు పనికిరాకుండా పోతాయి. ఆలోచనలు సవ్యంగా సాగవు. అనుమానాలు పెరుగుతాయి. సంతానం తీరు చికాకు పెడుతుంది. వివాదానికి దూరంగా ఉండండి.

సింహం : మీలాగే ఆలోచించే వారితో స్నేహం ఏర్పడుతుంది. రహస్యాలను దాచాల్సి వస్తుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండదు. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయండి. వృథా ఖర్చులు తగ్గించండి.

కన్య : అన్ని వైపులా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతాయి. అగ్రిమెంట్లకు అనుకూలం. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలుంటాయి. ఆలోచనలకు పదును పెడతారు.

తుల : నోటిదురుసు వల్ల పెద్ద చిక్కులో పడే సూచన ఉంది. బ్యాంకు లావాదేవీలు, ఇతరులతో ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు. ఇంట్లో చికాకులు తలెత్తుతాయి. ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చికం : రోజంతా ఉల్లాసంగా సాగుతుంది. అవసరానికి డబ్బు సమకూరుతుంది. ఆత్మీయులను కలుస్తారు. విందులో పాల్గొంటారు. ప్రతిష్ట పెరుగుతుంది. తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త సంగతులు తెలుస్తాయి.

ధనుస్సు : అనవసర జోక్యాలు తగ్గించుకోండి. ఆర్థిక క్రమశిక్షణ లేని కారణంగా కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది.. వేళకు భోజ ఉండదు. మిత్రులతో విరోధం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. సరిగా నిద్ర ఉండదు.

మకరం : సంతోషంగా సాగుతుంది. పనులు అనుకున్న రీతిలో ముగుస్తాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. సంతాన సంబంధ ఆనందాన్ని ఆస్వాదిస్తారు. పెద్దవారి సహకారం లభిస్తుంది. ఇష్టులతో విందులో పాల్గొంటారు.

కుంభం : అన్నింటా అనుకూలంగా ఉంటుంది. పనులు, ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగుతాయి. వృత్తి నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లకు అనుకూలం. బంధువులతో వినోదంగా గడుపుతారు. కీర్తి పెరుగుతుంది.

మీనం : పనులు నెమ్మదిస్తాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. పుణ్యస్థలాన్ని సందర్శిస్తారు. ప్రత్యర్థుల వేధింపులు పెరుగుతాయి. ఉద్యోగులు బాధ్యతగా మెలగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories