Horoscope Today in Telugu 13th September 2024: నోటిదురుసుతో చిక్కుల్లో పడే ఛాన్స్.. ఈ రాశి వారికి కష్టకాలమే..

Today Horoscope In Telugu Daily Rashhi Phalalu For 13th September 2024 Friday In Telugu
x

Horoscope Today in Telugu 13th September 2024: నోటిదురుసుతో చిక్కుల్లో పడే ఛాన్స్.. ఈ రాశి వారికి కష్టకాలమే..

Highlights

Horoscope Today in Telugu 13th September 2024: నోటిదురుసుతో చిక్కుల్లో పడే ఛాన్స్.. ఈ రాశి వారికి కష్టకాలమే..

13-09-2024 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : దశమి రాత్రి గం.10.30 ని.ల వరకు

నక్షత్రం: పూర్వాషాఢ రాత్రి గం.9.35 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తరాషాఢ

అమృతఘడియలు: సాయంత్రం గం.4.51 ని.ల నుంచి గం.6.26 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.7.22 ని.ల నుంచి గం.8.57 ని.ల వరకు మళ్లీ రేపు తె.వా. గం.5.14 ని.ల నుంచి గం.6.46 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.31 ని.ల నుంచి గం.9.20 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.36 ని.ల నుంచి గం.1.25 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.40 ని.ల నుంచి గం.12.12 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.04 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.20 ని.లకు

మేషం :


పనిలో బాగా అలసిపోతారు. బలహీనతలను బయటపెట్టకండి. శత్రువుల వేధింపులు పెరుగుతాయి. సంతానం తీరును విభేదిస్తారు. కొత్త ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది.

వృషభం :


అనుకున్న రీతిలో పనులు సాగవు. సదుపాయాలు సమకూరవు. చెప్పుడు మాటలు వినకండి. తగాదాలకు ఆస్కారముంది. పోటీల్లో ప్రత్యర్థులకే విజయావకాశాలు పెరుగుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మిథునం :


సంతృప్తికరంగా సాగుతుంది. ధన సంబంధ విషయాలు ఆశించినట్లే పూర్తవుతాయి. నూతన విజ్ఞానాన్ని పొందేందుకు అనువైన రోజు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మనశ్శాంతి లభిస్తుంది.

కర్కాటకం:


శుభ ఫలితాలను పొందుతారు. ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. బలహీనతలను అధిగమిస్తారు. శారీరక, మానసిక ఇబ్బందులు తొలగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

సింహం :


ప్రతి పనికీ ఆటంకం ఉంటుంది. బద్ధకాన్ని వదిలి పెట్టండి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు పాటించండి. సంతానం తీరు చికాకు పెడుతుంది. వాత సంబంధ సమస్యలుంటాయి.

కన్య :


కార్యసాధనకు బాగా శ్రమించాలి. ఆలోచన విధానం మారుతుంది. రహస్యాలను దాచాల్సి వస్తుంది. సహాయకుల వల్ల మాట పడే సూచన ఉంది. ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టండి.

తుల :


పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. దాయాదులతో సఖ్యత ఏర్పడుతుంది. కీర్తి వృద్ధి చెందుతుంది.

వృశ్చికం :


పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. ముందుచూపు లేమితో చేసే పనుల వల్ల ఇబ్బందులొస్తాయి. నింద ఎదుర్కోవాల్సి వస్తుంది. అకారణ విరోధం గోచరిస్తోంది. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు :


తలపెట్టిన పనుల్లో వేగం పెంచండి. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మిత్రులతో విందులో పాల్గొంటారు.

మకరం :


పని సవ్యంగా సాగదు. వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. ప్రయాణం వాయిదా వేయండి. ఏకాంతాన్ని కోరుకుంటారు. అసూయ వద్దు. స్నేహం చెడకుండా చూసుకోండి.

కుంభం :


అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. ధన వ్యవహారాలు తృప్తిగా ఉంటాయి. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. శుభకార్యంలో పాల్గొంటారు. కొత్త వస్తువులను సేకరిస్తారు.

మీనం :


మీ నైపుణ్యానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. అధికార వృద్ధి గోచరిస్తోంది. పోటీల్లో విజయం సాధిస్తారు. విదేశీ సంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories