Horoscope Today in Telugu 11th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Today Horoscope In Telugu Daily Raashi Phalalu For 11th September 2024 Wednesday In Telugu
x

Horoscope Today in Telugu 11th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Highlights

Horoscope Today in Telugu 11th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

11-09-2024 (బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : అష్టమి రాత్రి గం.11.46 ని.ల వరకు

నక్షత్రం: జ్యేష్ట రాత్రి గం.9.22 ని.ల వరకు

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.12.05 ని.ల నుంచి గం.1.46 ని.ల వరకు

వర్జ్యం: రేపు తె.వా. గం.5.32 ని.ల నుంచి గం.7.10 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.48 ని.ల నుంచి గం.12.37 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.13 ని.ల నుంచి గం.1.45 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.04 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.21 ని.లకు

మేషం :


పనులు అనుకున్న రీతిలో సాగవు. ఆలోచనలు వక్రగతిలో సాగుతాయి. చెడుదారులు తొక్కే ఆస్కారం ఉంది. మనసును నిగ్రహించుకోండి. అధికారుల కోపానికి గురయ్యే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్త.

వృషభం :


ఆశించిన లబ్ది చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త విషయాలపై అవగాహన పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది. కీర్తి వృద్ధి చెందుతుంది.

మిథునం :


కార్యజయం ఉంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కొత్త వస్తువలను సేకరిస్తారు. మిత్రులు సహకరిస్తారు. మానసికంగా దృఢంగా తయారవుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

కర్కాటకం:


అనవసర జోక్యాలు వద్దు. మీ సూచనలకు గుర్తింపు ఉండదు. సంతానం తీరును ఓ కంట కనిపెట్టడం అవసరం. వాత సంబంధ సమస్య ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. విలువైన వస్తువులు జాగ్రత్త.

సింహం :


కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాల్సి వుంటుంది. మీ మనస్తత్వానికి తగ్గ పరిచయాలు వృద్ధి చెందుతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. బంధువులకు దూరమయ్యే సూచన ఉంది. ఆస్తి అమ్మే ప్రయత్నం వద్దు.

కన్య :


పనులు విజయవంతం అవుతాయి. అందరి నుంచీ తోడ్పాటు లభిస్తుంది. ఆదాయ వృద్ధి ఉంది. ఆలోచనలు సవ్యంగా సాగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

తుల :


వ్యవహార నష్టం గోచరిస్తోంది. ప్రతి పనికీ ఆటంకాలుంటాయి. ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టి ఉండాలి. ఇతరుల వల్ల కూడా ఇబ్బందులొస్తాయి. అకారణ విరోధాలకు దూరంగా ఉండండి. వేళకు భోజనం ఉండదు.

వృశ్చికం :


పనులు ఆశించినట్లే పూర్తవుతాయి. ధన సంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. గృహోపకరణాలను సమకూర్చుకుంటారు. తెలివితేటలకు తగిన గుర్తింపు వస్తుంది. విందులో పాల్గొంటారు అదృష్టం వరిస్తుంది.

ధనుస్సు :


ఆకస్మిక ధన వ్యయం గోచరిస్తోంది. పనులు కూడా అనుకున్న రీతిలో సాగవు. విదేశీ వ్యవహారాలను కొనసాగించే వారికి అనుకూలం. మిత్రుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణం వాయిదా వేయండి.

మకరం :


ఉల్లాసంగా గడుపుతారు. ఆకాంక్ష నెరవేరుతుంది. ఇష్టమైన వారిని కలుస్తారు. సహచరుల తోడ్పాటు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనశ్శాంతిని పొందుతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.

కుంభం :


ఉన్నతస్థాయికి చేరాలన్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్నింటా అనుకూలమైన ఫలితాలుంటాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థిక చిక్కులు తొలగుతాయి. బంధువులతో విందులో పాల్గొంటారు.

మీనం :


పనుల్లో జాప్యం ఉంటుంది. బద్ధకాన్ని వదిలి కష్టించాలి. వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వుంటుంది. సంతానం తీరు చికాకు పరుస్తుంది. గురువులను కలుస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories