Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 20 July 2024

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 20 July 2024
x

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 20 July 2024

Highlights

Today Horoscope in Telugu, 20 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 20 శనివారం నాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

Today Horoscope in Telugu, 20 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 20 శనివారం నాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం.

తిధి: చతుర్దశి సాయంత్రం గం.5.59 ని.ల వరకు.

నక్షత్రం: పూర్వాషాడ అర్ధరాత్రి గం.1.49 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తరాషాఢ.

అమృతఘడియలు: రాత్రి గం.9.14 ని.ల నుంచి గం.10.45 ని.ల వరకు.

వర్జ్యం: మధ్యాహ్నం గం.12.04 ని.ల నుంచి గం.1.36 ని.ల వరకు.

దుర్ముహూర్తం: తె.వా. గం.5.52 ని.ల నుంచి గం. 7.36 ని.ల వరకు.

రాహుకాలం: ఉదయం గం.9.07 ని.ల నుంచి గం.10.45 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం.5.52 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం.6.53 ని.లకు.

మేషం

ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో చికాకులుంటాయి. బంధువులతో వివాదాలొస్తాయి. దూర ప్రయాణం గోచరిస్తోంది. భవిష్యత్ గురించిన ఆలోచనలొస్తాయి. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది.

వృషభం

అనుకున్న రీతిలో పురోగతి ఉండదు. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. తగాదాలకు దూరంగా ఉండండి. పెద్దల కోపానికి గురయ్యే సూచన ఉంది. చేస్తున్న పనిమీద అయిష్టత ఏర్పడుతుంది. కీళ్ల సమస్యలుంటాయి.

మిథునం

పరిచయస్తులందరితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తారు. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. దేహసౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలుస్తారు.

కర్కాటకం

పనులు విజయవంతమవుతాయి. రాజీ ద్వారా వివాదాలు సమసిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో శుభఫలితాలు లభిస్తాయి. కొత్త వస్తువులను కొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు.

సింహం

సంతాన వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. అనవసర జోక్యాల వల్ల విరోధం పెరుగుతుంది. అభీష్టం నెరవేరక పోవడం వేదనను కలిగిస్తుంది. వృథా ఖర్చులను తగ్గించాలి. నిరాశ, బద్ధకాలను వదిలి కృషి చేయండి.

కన్య

ఇంటికి సంబంధించిన వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. బుద్ధి నిలకడ లోపిస్తుంది. పనులు అనుకున్నట్లుగా జరగవు. మనశ్శాంతి కరువవుతుంది. స్థిరాస్తి రంగంలోని వారికి వ్యతిరేక ఫలితముంటుంది.

తుల

అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. పనుల్లో విశేష లాభం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసుకి నచ్చిన వారిని కలుస్తారు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. వస్తువులు కొంటారు. వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికం

ఆర్థిక లావాదేవీల్లో జాప్యం ఏర్పడుతుంది. మాట పలుకుబడి తగ్గుతుంది. పనులకు ఆటంకాలుంటాయి. ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. కుటుంబంలో చికాకులొస్తాయి. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయండి.

ధనుస్సు

పలుకుబడి పెరుగుతుంది. కార్యాలన్నీ సఫలమవుతాయి. ఆర్థిక చిక్కులు క్రమంగా తొలగుతాయి. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకరం

వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది. ఆచితూచి అడుగులేయండి. తొందరపాటు నిర్ణయాలతో అగౌరవానికి గురవుతారు. అనూహ్యమైన ఖర్చులొస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. వేళకు భోజనముండదు.

కుంభం

సంతోషంగా గడుపుతారు. ధనలాభం ఉంది. ఇతరుల నుంచి కూడా సహకారం లభిస్తుంది. విజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నాలకు అనుకూలం. గృహనిర్మాణం గురించి ఆలోచిస్తారు. విందులో పాల్గొంటారు.

మీనం

చక్కటి అవకాశాలు కలిసొస్తాయి. చేస్తున్న పనులపై ఏకాగ్రత కుదురుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. అభీష్టం ఫలిస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories