Vastu Tips: ఈ చెట్లు, మొక్కలు పొరపాటున కూడా ఇంట్లో పెంచకూడదు.. చాలా బాధపడుతారు..!

These Trees And Plants Should Not Be Grown At Home Even By Mistake They Will Suffer A Lot
x

Vastu Tips: ఈ చెట్లు, మొక్కలు పొరపాటున కూడా ఇంట్లో పెంచకూడదు.. చాలా బాధపడుతారు..!

Highlights

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఒక వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. వాస్తులో చెట్లు, మొక్కలు పెంచడానికి ఒక పద్దతి ఒక దిశ ఉంటుంది.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఒక వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. వాస్తులో చెట్లు, మొక్కలు పెంచడానికి ఒక పద్దతి ఒక దిశ ఉంటుంది. ఈ నియమాలు పాటించకుంటే ఇంటి సభ్యులు నెగిటివ్‌ ఎఫెక్ట్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పొరపాటున కూడా కొన్ని చెట్లు, మొక్కలు నాటకూడదు. వీటివల్ల ఇంట్లో దురదృష్టం, దారిద్ర్యం వస్తుంది. పొరపాటున కూడా ఇంట్లో ఏయే చెట్లు, మొక్కలు నాటకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

పొరపాటున ఇంటి ఆవరణలో ఖర్జూర చెట్టు నాటకూడదు. ఇది అశుభమైనదిగా చెబుతారు. ఈ చెట్టు చూడటానికి చాలా అందంగా కనిపించినప్పటికీ దీనిని నాటడం వల్ల కుటుంబ సభ్యుల రుణం పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చింత చెట్టు ఉండకూడదు. అది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఇంట్లో ఎప్పుడూ భయం వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో నాటిన చెట్టు లేదా మొక్క ఎండిపోతుంటే దాన్ని తొలగించడం మంచిది. వాస్తు ప్రకారం ఎండిన చెట్లు, మొక్కలు ఇంట్లో దుఃఖాన్ని కలిగిస్తాయి.

నేటి కాలంలో ఇంటి అలంకరణ కోసం బోన్సాయ్ మొక్కలను పెంచే ట్రెండ్ పెరిగింది. ఈ మొక్కలు ఖచ్చితంగా అందంగా కనిపిస్తాయి కానీ వాటిని ఇంట్లో పెంచడం వల్ల నెగిటివ్‌ ప్రభావాలు ఉంటాయి. ఇవి అభివృద్ధికి అడ్డంకులుగా మారుతున్నాయి. మెహందీ మొక్కలో దుష్ట శక్తులు నివసిస్తాయని నమ్మకం. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల నెగిటివ్‌ శక్తి వ్యాపిస్తుందని చెబుతారు. ఈ మొక్క ఇంటి ఆనందాన్ని శాంతిని భంగం చేస్తుంది.

శాస్త్రాల ప్రకారం ఇంట్లో పటిక మొక్కను నాటడం వల్ల వివాదాలు పెరుగుతాయి. దీంతో కుటుంబ సభ్యులు మానసిక అస్వస్థతకు గురవుతారు. ఇది ఇంటి చుట్టూ ఉండటం అశుభకరమైనదిగా చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ముళ్ల మొక్కలను ఇంటి లోపల, పరిసరాల్లో ఎప్పుడూ నాటకూడదు. దీంతో ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. ఈ మొక్కలు పరస్పర విభేదాలను పెంచడానికి పనిచేస్తాయి. చాలా సార్లు ప్రజలు ఈ మొక్కలను తెలియకుండా నాటుతారు. తర్వాత చాలా బాధపడుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories