Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (October 18, 2024)

Telugu Horoscope Today
x

Telugu Horoscope Today

Highlights

Telugu Horoscope Today, October 18, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

Telugu Horoscope Today, October 18, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.

తిధి: పాడ్యమి మధ్యాహ్నం గం.1.15 ని.ల వరకు ఆ తర్వాత విదియ.

నక్షత్రం: అశ్వని మధ్యాహ్నం గం.1.26 వరకు ఆ తర్వాత భరణి.

అమృతఘడియలు: ఉదయం గం.7.06 ని.ల నుంచి గం.8.31 ని.ల వరకు.

వర్జ్యం: ఉదయం గం.9.55 ని.ల నుంచి గం.11.19 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.9.58 ని.ల నుంచి గం.11.24ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.8.30 ని.ల నుంచి గం.9.17 ని.ల వరకు మల్లీ మధ్యాహ్నం గం.12.25 ని.ల నుంచి గం.1.11 ని.ల వరకు.

రాహుకాలం: ఉదయం గం.10.33 ని.ల నుంచి గం. 12.01 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.10 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.52 ని.లకు.

మేషం

కాలం అనుకూలంగా ఉంది. కీలక వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. బంధువులతో విందులకు హాజరవుతారు. గౌరవం లభిస్తుంది. వాహన యోగముంది. ఆరోగ్యం బావుంటుంది.

వృషభం

మితిమీరిన ఖర్చులు ఆందోళనకు గురిచేస్తాయి. ప్రయత్నాలు బెడిసికొట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది.

మిథునం

యోగదాయకంగా ఉంటుంది. సంతాన సౌఖ్యం లభిస్తుంది. శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. ఇష్టులతో విందుకు వెళతారు. బంధాలు బలపడతాయి.

కర్కాటకం

ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తారు. కార్యక్రమాలన్నింట్లోనూ విజయాలు సొంతమవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

సింహం

ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు తృప్తికరంగా సాగవు. కడుపులో ఇబ్బందికరంగా ఉంటుంది. గురు సమానులను కలుస్తారు. దైవ చింతన వృద్ధి చెందుతుంది.

కన్య

వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు. వారసత్వ ఆస్తి సంబంధ వ్యవహారాలు బెడిసికొట్టే సూచన ఉంది. ఇష్టంలేని కార్యాలు చేయాల్సి వుంటుంది. అపోహలు పెరుగుతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

తుల

వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలుంటాయి. ధన సంబంధ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. జీవిత భాగస్వామి సూచన మేలు చేస్తుంది. ప్రయాణం ఉపకరిస్తుంది.

వృశ్చికం

ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అడ్డంకులను తేలిగ్గా దాటేస్తారు. ఆర్థిక చిక్కులు తొలగిపోతాయి. గొడవలు సద్దు మణుగుతాయి. కోర్టు లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనుస్సు

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇష్టమైన కార్యం భగ్నం కావడం చింతను పెంచుతుంది. దురాలోచనను నియంత్రించాలి. కీలక వ్యవహారాల్లో మీ తెలివితేటలు ఉపకరించవు. ప్రణయ వ్యవహారాలు బెడిసికొడతాయి.

మకరం

బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. నోటిదురుసు వల్ల విరోధాలు పెరుగుతాయి. అంతర్గతంగా ఉన్న అసూయ బయటపడుతుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం

ఈరోజు అన్ని రకాలుగానూ మెరుగ్గా ఉంటుంది. నాయకత్వ లక్షణాలతో పై అధికారులను మెప్పిస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సోదరులు సహకరిస్తారు.

మీనం

ఆటంకాల వల్ల పనులు సవ్యంగా సాగవు. మాట తప్పడం వల్ల నిందలు పడాల్సి వస్తుంది. పలుకుబడి తగ్గుతుంది. నోటిదురుసు వల్ల విరోధాలు ఏర్పడతాయి.. వేళకు భోజనముండదు. కంటి సమస్యలుంటాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories