Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే (October 14, 2024)

Horoscope Today
x

Horoscope Today

Highlights

Telugu Horoscope Today, October 14, 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే.

Telugu Horoscope Today, October 14, 2024: నేటి రాశి ఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: ద్వాదశి అర్ధరాత్రి గం.12.29 ని.ల వరకు

నక్షత్రం: శతభిషం రాత్రి గం.10.28 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాభాద్ర

అమృతఘడియలు: సాయంత్రం గం.6.09 ని.ల నుంచి గం.7.37 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.9.25 ని.ల నుంచి గం.10.52 ని.ల వరకు

దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.25 ని.ల నుంచి గం.1.13 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.47 ని.ల నుంచి గం.3.34 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.7.37 ని.ల నుంచి గం. 9.05 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.09 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.55 ని.లకు

మేషం

ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఇష్టమైన వారిని కలుస్తారు. అభివృద్ధికి సంబంధించిన చర్చలు చేస్తారు. మిత్రులు కూడా సహకరిస్తారు. విందులో పాల్గొంటారు. ఆకాంక్ష తీరుతుంది.

వృషభం

ఇష్టకార్యం అనుకూలంగా సాగుతుంది. ఇతరులతో విభేదాలు వచ్చినా సమయస్ఫూర్తితో పరిష్కరిస్తారు. పెద్దవారి అభిమానాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధువులతో విందుకు హాజరవుతారు.

మిథునం

కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిది కాదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తొందరపాటు వద్దు. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది. కడుపు సంబంధ సమస్యలుంటాయి.

కర్కాటకం

ఆకస్మిక ధన నష్టం గోచరిస్తోంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఏ విషయంలోనైనా పోటీ పడకుండా సమయస్ఫూర్తిని చూపండి. ఆరోగ్యం జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం.

సింహం

రోజు తృప్తికరంగా సాగుతుంది. అన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధాలు బలపడతాయి. ప్రయాణం లాభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధువులను కలుస్తారు. శారీరక, మానసిక శాంతి లభిస్తుంది.

కన్య

వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ప్రయత్నాలన్నీ శుభ ఫలితాలనిస్తాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. అదృప్టం తోడుగా నిలుస్తుంది. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది

తుల

ఆటంకాలు పెరుగుతాయి. బద్ధకం కారణంగా చిక్కుల్లో పడతారు. నీచపు ఆలోచనలను అదుపు చేయాలి. సంతాన సంబంధ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం

పనులకు ఆటంకాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లొ అప్రమత్తంగా ఉండాలి. సహాయం చేస్తానన్నవారు ముఖం చాటేస్తారు. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. వృథా ఖర్చులుంటాయి. వాహనాలతో జాగ్రత్త.

ధనుస్సు

అన్ని రకాలుగానూ శుభప్రదంగా ఉంటుంది. స్వయంకృషికి తగ్గ ఫలితం ఉంటుంది. కమ్యూనికేషన్స్ లాభసాటిగా ఉంటాయి. డబ్బుకి సంబంధించిన చికాకులు తొలగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.

మకరం

కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వుంటుంది. ఇతరుల వల్ల ఇబ్బందులు వస్తాయి. అనవసర జోక్యాలు వద్దు. రెండో పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయండి. ఆస్తినష్టం గోచరిస్తోంది. హామీలు ఇవ్వకండి.

కుంభం

తెలివితేటలకు గుర్తింపు వస్తుంది. ధనలాభం ఉంది. ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. మిత్రులతో విందుకు హాజరవుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వాహన యోగం ఉంది.

మీనం

పనులు అనుకున్నరీతిలో సాగవు. మనసు కలతబారుతుంది. బద్దకం వల్ల ఇబ్బంది వస్తుంది. దూర ప్రాంత ప్రయాణం గోచరిస్తోంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సా వస్తుంది. మిత్రుల వ్యవహారాల్లో అతి జోక్యం వద్దు.



Show Full Article
Print Article
Next Story
More Stories