Telugu Horoscope Today: నేటి మీ రాశిఫలాలు ఇలా..(1/11/2024)
Telugu Horoscope Today, November 1, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
Telugu Horoscope Today, November 1, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం
తిధి: అమావాస్య సాయంత్రం గం.6.16 ని.ల వరకు ఆ తర్వాత పాడ్యమి
నక్షత్రం: స్వాతి అర్ధరాత్రి దాటాక తె.వా.గం.3.31 ని.ల వరకు ఆ తర్వాత విశాఖ
అమృతఘడియలు: సాయంత్రం గం.5.42 ని.ల నుంచి గం.7.29 ని.ల వరకు
వర్జ్యం: ఉదయం గం.6.59 ని.ల నుంచి గం.8.46 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.8.33 ని.ల నుంచి గం.9.19 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.23 ని.ల నుంచి గం.1.09 ని.ల వరకు
రాహుకాలం: ఉదయం గం.10.33 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.00 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.15 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 5.45 ని.లకు
మేషం
వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కీర్తి వృద్ధి చెందుతుంది.
వృషభం
అపార్థాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ధన సంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. విందుకు హాజరవుతారు. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మిథునం
పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటుంది. అడుగడుగునా ఆటంకాలు వస్తాయి. బద్ధకిస్తే మరింత సమస్యగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వాత సంబంధ సమస్య ఉంటుంది. వృథా ఖర్చు తగ్గించాలి.
కర్కాటకం
బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే గొడవలు వస్తాయి. ఆర్థిక చికాకులు కూడా మనశ్శాంతిని దూరం చేస్తాయి. విద్య, రియల్ ఎస్టేట్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. నమ్మినవారే మోసం చేసే వీలుంది.
సింహం
కార్యక్రమాలు శుభప్రదంగా సాగుతాయి. ఆత్మీయుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. మీ వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. తోబుట్టువుల సమస్యలను పరిష్కరిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.
కన్య
ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెంచండి. అకారణ విరోధాలకు ఆస్కారముంది. నోటి దురుసును తగ్గించుకోండి. అనవసర జోక్యాలు మానుకోండి. వేళకు భోజనముండదు.
తుల
అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది. మీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో చాలామంది సహకరిస్తారు. మానసిక స్థైర్యం పెరుగుతుంది. కీర్తి పెరుగుతుంది.
వృశ్చికం
మనసు నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. అనవసర జోక్యాలను మానుకోండి. ఇతరులను చూసి అసూయ చెందకండి. వేళకు భోజనముండదు. బద్ధకం వల్ల పని మరింత ఆలస్యమౌతుంది.
ధనుస్సు
కొత్త బంధాలు ఏర్పడతాయి. ఆనందంగా ఉంటుంది. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. సంతాన సంబంధ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. ఆరోగ్యం బావుంటుంది. శత్రుపీడ తగ్గుతుంది.
మకరం
అభీష్టం నెరవేరుతుంది. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. స్నేహితులు సహకరిస్తారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. మనశ్శాంతి లభిస్తుంది
కుంభం
పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. అనవసర కలహాలకు ఆస్కారముంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. కడుపులో సమస్య వస్తుంది.
మీనం
మీ బలహీనతలపై శత్రువులు దెబ్బతీసే వీలుంది. అనవసరంగా పోటీలకు దిగకండి. అనుకున్న సదుపాయాలు సమకూరవు. తగాదాలకు దూరంగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire