Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (11/12/2024)

Telugu Horoscope Today December 11, 2024
x

Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (11/12/2024)

Highlights

Telugu Horoscope Today, December 11, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Telugu Horoscope Today, December 11, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

మేషం

సమస్యలు ఎదురైనా పనులు నెరవేరతాయి. ఖర్చులను అదుపు చేయండి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బాల్యస్నేహితులను కలుస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.

వృషభం

అభీష్టం నెరవేరుతుంది. పనుల సాధనలో విపరీతంగా శ్రమించాల్సి వుంటుంది. సంతాన విషయాలు తృప్తినిస్తాయి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. దూర ప్రాంతానికి వెళతారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

మిథునం

రోజంతా శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. ధన సంబంధ చికాకులు తొలగుతాయి. వృత్తి నైపుణ్యం ప్రదర్శిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. సహచరులు సహకరిస్తారు.

కర్కాటకం

ఇబ్బందులను సమర్థంగా అధిగమిస్తారు. నిర్దేశించుకున్న ప్రకారమే పనులను పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. మనశ్శాంతి లభిస్తుంది.

సింహం

వ్యవహారాలు సంక్లిష్టంగా మారతాయి. సమస్యకు పరిష్కారం కోసం తపిస్తారు. శత్రుపీడ ఎక్కువవుతుంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. మనశ్శాంతి లోపిస్తుంది. ఆధ్యాత్మికాంశాలపై ఆసక్తి పెరుగుతుంది.

కన్య

చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలం కావు. అంతా సవ్యంగా ఉన్నట్లనిపించినా, చివరికి వచ్చేసరికి చికాకులు పెరుగుతాయి. తగాదాలకూ ఆస్కారం ఉంది. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలను తీసుకోండి.

తుల

ఆశించిన లక్ష్యాన్ని చేరతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. ఇతరులతో బంధాలూ బలపడతాయి.

వృశ్చికం

బద్ధకం వీడి పనిచేస్తేనే పనులు సఫలమవుతాయి. వ్యక్తిగత సామర్థ్యం, విశ్లేషణలకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. కొత్త వస్తువులను కొంటారు. వాత సమస్య ఉంటుంది. నిరాశ చెందకండి.

ధనుస్సు

వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలను వాయిదా వేయండి. బుద్ధి నిలకడగా ఉండదు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. కీలక కార్యంలో సోదరులు అండగా నిలుస్తారు. కీలక సమాచారం ఆనందపరుస్తుంది.

మకరం

ఒడుదుడుకులు ఎదురైనా పనులు విజయవంతం అవుతాయి. బ్యాంకు లావాదేవీలు ఆలస్యమవుతాయి. సోదరుల సహకారం లభిస్తుంది. సమీప ప్రాంతానికి ప్రయాణం గోచరిస్తోంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కుంభం

అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు. నిందలను భరించాల్సి వస్తుంది. మనోధైర్యంతో చేసే ప్రయత్నాలకు మిత్రులు సహకరిస్తారు. కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకండి.

మీనం

ఇబ్బందులు చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది. సమయస్ఫూర్తి, దీక్షలతో వాటిని అధిగమిస్తారు. అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. అంతులేని ఆనందం లభిస్తుంది. బంధువులతో విందుకు వెళతారు. అదృష్టం వరిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories