నేటి మీ రాశి ఫలాలు ఇలా 10/12/2024

Telugu Horoscope Today 10 December 2024
x

నేటి మీ రాశి ఫలాలు ఇలా 10/12/2024

Highlights

Telugu Horoscope Today, 10 December 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Telugu Horoscope Today, December 10, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం.

తిధి: దశమి అర్ధరాత్రి దాటాక తె.వా. గం.3.42 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి.

నక్షత్రం: ఉత్తరాభాద్ర మధ్యాహ్నం గం.1.30 ని.ల వరకు ఆ తర్వాత రేవతి.

అమృతఘడియలు: ఉదయం గం.8.59 ని.ల నుంచి గం.10.30 ని.ల వరకు.

వర్జ్యం: అర్ధరాత్రి గం.12.39 ని.ల నుంచి గం.2.08 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.8.49 ని.ల నుంచి గం. 9.34 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.10.52 ని.ల నుంచి గం.11.44 ని.ల వరకు.

రాహుకాలం: మధ్యాహ్నం గం.2.56 ని.ల నుంచి గం.4.19 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.36 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.43 ని.లకు.

మేషం

పనులు అనుకున్న స్థాయిలో జరగవు. నిరాశ చెందకుండా స్థిర చిత్తంతో కృషి చేయండి. వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బంధు విరోధం ఏర్పడుతుంది.

వృషభం

ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. డబ్బుకి ఇబ్బందేమీ ఉండదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతానం శైలి ఆనందాన్నిస్తుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు.

మిథునం

వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. తండ్రి సామాజిక స్థితి అనుకూలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.. వృత్తి నిపుణులకు మేలిమి కాలం. మనశ్శాంతిని పొందుతారు.

కర్కాటకం

కార్యసాధనలో అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. పనుల్లో జాప్యం వల్ల కొంత అశాంతి కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల కీలక సమస్య నుంచి గట్టెక్కుతారు. బాధ్యతల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి.

సింహం

చెప్పుడు మాటలను నమ్మితే నష్టపోతారు. మీ విజ్ఞతను ఉపయోగించి అపోహలను తొలగించుకోండి. అవసరమైన డబ్బు చేతికొచ్చినా వృథాగా ఖర్చవుతుంది. తగాదాల్లో తలదూర్చకండి. శత్రుపీడ ఉంటుంది.

కన్య

వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అంతర్గత ఆనందం పెరుగుతుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. అన్ని ప్రయత్నాల్లోనూ ఆత్మీయుల సహకారం ఉంటుంది. ప్రయాణం శుభప్రదంగా సాగుతుంది. కీర్తి పెరుగుతుంది.

తుల

సంకల్పం సిద్ధిస్తుంది. ధనలాభం గోచరిస్తోంది. బంధుమిత్రుల సహకారాన్ని పొందుతారు. బలహీనతలను అధిగమిస్తారు. మనోవేదన తీరుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులను జయిస్తారు.

వృశ్చికం

అభీష్టం నెరవేరే సూచన లేదు. బద్ధకం వదిలి పనిచేస్తే ఓ మోస్తరు ఫలితమైనా దక్కుతుంది. కీలక నిర్ణయాల్లో సొంత తెలివితేటలను వాడకండి. వృథా ఖర్చును అదుపు చేయాలి. వాత సంబంధ అనారోగ్యం వచ్చే వీలుంది.

ధనుస్సు

పనులకు అడ్డంకులు వస్తాయి. వ్యవహారాల్లో జాప్యం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంబంధాలు బెడిసి కొట్టే సూచన ఉంది. రహస్య జీవితం బట్టబయలు అవుతుంది. అవమానం గోచరిస్తోంది. వృథా ఖర్చుంటుంది.

మకరం

భావాన్ని చక్కగా వ్యక్తం చేస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. గొంతుకు సంబంధించిన సమస్య తొలగిపోతుంది. సోదరులు తోడుగా నిలుస్తారు.

కుంభం

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా బ్యాంకు వ్యవహారాలు ఆశించిన స్థాయిలో జరగవు. ముందుచూపు లేమితో చేసే పనుల వల్ల నష్టపోతారు. భవిష్యత్తుపై బెంగ కలుగుతుంది.

మీనం

పరిస్థితులు బాగా మెరుగవుతాయి. వ్యవహారాలన్నింటా విజయం సాధిస్తారు. అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. మానసిక స్థైర్యం పెరుగుతుంది. వ్యక్తిత్వాన్ని మెరుగు పరుచుకుంటారు. వాహనయోగం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories