Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 4 July 2024

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 4 July 2024
x
Highlights

Today Horoscope in Telugu 4th July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? 4 జులై 2024 గురువారంనాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

Today Horoscope in Telugu 4th July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? 4 జులై 2024 గురువారంనాటి రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి: త్రయోదశి ఉదయం గం.5.54 ని.లకు ఆ తర్వాత చతుర్దశి

నక్షత్రం: మృగశిర రేపు తె.వా. గం.3.54 ని.ల వరకు తర్వాత ఆరుద్ర

అమృతఘడియలు: రాత్రి గం.7.11 ని.ల నుంచి గం.8.46 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.9.40 ని.ల నుంచి గం.11.15 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.10.09 ని.ల నుంచి గం.11.02 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.25 ని.ల నుంచి గం.4.17 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.1.59 ని.ల నుంచి గం.3.38 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా.గం.5.47 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.55 ని.లకు

మేషం

అభీష్టాలు నెరవేరవు. విఘ్నాలు ఎదురవుతాయి. మాట తూలడం వల్ల సమస్యలొస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ చిక్కులు మనశ్శాంతిని దూరం చేస్తాయి. తగాదాలకు దూరంగా ఉండండి.

వృషభం

అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి పురోభివృద్ధి ఉంటుంది. విందు గోచరిస్తోంది. కుటుంబానికి ప్రాధాన్యాన్నిస్తారు. గృహోపకరణాలు కొంటారు. శారీరక సౌఖ్యాం లభిస్తుంది.

మిథునం

వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. అడుగడుగునా ఇబ్బందులుంటాయి. దూర ప్రయాణం గోచరిస్తోంది. విద్యావ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. బాధ్యతలను వీడాల్సి వస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.

కర్కాటకం

శుభ కార్యాచరణకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో కదలిక వస్తుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సంతాన సంబంధ సమస్య తీరుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

సింహం

అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది. చక్కటి అవకాశాలొస్తాయి. అధికారుల తోడ్పాటు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువులను కలుస్తారు. ఇష్టకార్యం నెరవేరుతుంది. ఇంటి పరిస్థితి తృప్తినిస్తుంది.

కన్య

సంతానం గురించి ఆలోచన చేస్తారు. మీ నిర్ణయాలకు వ్యతిరేకత వస్తుంది. బుద్ధి కుశలతతో సమస్యను పరిష్కరిస్తారు. ఉన్నత విద్యకు ఆటంకం వస్తుంది. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. తగాదాలు వద్దు.

తుల

బాగా కష్టపడాల్సి ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు కావు. ఉద్రేకాన్ని అదుపు చేసుకోవాలి. తగాదాలు వద్దు. అధికారులు, పెద్దల కోపానికి గురయ్యే సూచన ఉంది. అజీర్తి ఇబ్బంది పెడుతుంది.

వృశ్చికం

ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. సర్వత్రా సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. విందులో పాల్గొంటారు. ప్రయాణం ఆనందంగా సాగుతుంది.

ధనుస్సు

కార్యజయం ఉంది. అభీష్టం నెరవేరుతుంది. రుణదాతల ఒత్తిడి తగ్గుతుంది. కీలకాంశాల్లో ఆత్మీయుల సూచన శుభాన్ని చేకూరుస్తుంది. శత్రుపీడ ఉండదు. ఆరోగ్యం బావుంటంది. సేవారంగంలోని వారికి మేలు.

మకరం

అభీష్టం అంత తేలిగ్గా నెరవేరదు. సంతాన సంబంధ చింత ఏర్పడుతుంది. అనవసర ఖర్చులుంటాయి. మీ మేథస్సుకు తగిన గుర్తింపు ఉండదు. ఆలోచనలు సవ్యగా సాగవు. బద్ధకాన్ని వీడి బాగా కష్టపడాలి.

కుంభం

కార్యనష్టాలు, అవమానాలు ఒత్తిళ్లకు గురి చేస్తాయి. మాతృ సంబంధంగా చింత ఏర్పడుతుంది. బుద్ధి నిలకడగా ఉండదు. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయండి.. విద్యాసంబంధ అంశాలు ప్రతికూలిస్తాయి.

మీనం

అభీష్టం నెరవేరుతుంది. శుభ వర్తమానం అందుతుంది. ఆర్థిక ఇక్కట్లుండవు. కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారు. మీ ధైర్యసాహసాలకు ప్రశంసలు లభిస్తాయి. మిత్రులు తోడుంటారు. ఆత్మీయులను కలుస్తారు.



Show Full Article
Print Article
Next Story
More Stories