Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 15 July 2024

Rasi Phalalu Daily Horoscope For 15 July 2024 Monday In Telugu
x

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 15 July 2024

Highlights

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 15 July 2024

15-07-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు,శుక్ల పక్షం

తిధి : నవమి సాయంత్రం గం.7.19 ని.ల వరకు ఆ తర్వాత దశమి

నక్షత్రం: స్వాతి అర్ధరాత్రి 12.30 ని.ల వరకు విశాఖ

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.2.49 ని.ల నుంచి గం.4.35 ని.ల వరకు

వర్జ్యం: ..

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.48 ని.ల నుంచి గం.1.41 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.25 ని.ల నుంచి గం.4.35 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.28 ని.ల నుంచి గం.9.06 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.50 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.54 ని.లకు


మేషం :

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగానే సాగుతాయి. అనుబంధాలు బలపడతాయి. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. మీ కార్యదక్షతకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.


వృషభం :

శుభ ఫలితాలుంటాయి. రుణ సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. శత్రపీడ తొలగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సేవారంగంలోని వారికి యోగదాయకంగా ఉంటుంది.


మిథునం :

అభీష్టం నెరవేరదు. ఆటంకాలను అధిగమించాల్సి వుంటుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. ఆలోచనలు వక్రగతిలో సాగుతాయి. అనుమానాలు పెరుగుతాయి. దత్తాత్రేయ స్వామిని పూజించడం మేలు.


కర్కాటకం:

ప్రతి పనికీ అడ్డుంకులు ఎదురవుతాయి. స్థిరచిత్తంతో కార్యాన్ని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది ఆస్తి లావాదేవీలు వాయిదా వేయండి. శ్రీవేంకటేశుని పూజించండి.


సింహం :

మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. చేపట్టిన కార్యాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. మీ ధైర్యానికి గుర్తింపు లభిస్తుంది. మిత్రులు తోడుగా నిలుస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


కన్య :

పనులకు విఘ్నాలుంటాయి. వ్యవహారాలు అనుకూలించవు. బ్యాంకు లావాదేవీల్లో ప్రతిష్ఠంభన ఉంటుంది. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. వేళకు భోజనం ఉండదు. శ్రీ లక్ష్మీనృసింహుణ్ణి పూజించడం మంచిది.


తుల :

వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరతాయి. ధనలాభం ఉంది. విందుల్లో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. ఆనందంగా గడుపుతారు.


వృశ్చికం :

పనులు ఆశించిన స్థాయిలో పూర్తికావు. ధనసంబంధ చికాకులు కలవర పరుస్తాయి. వేళకు భోజనం ఉండదు. అసూయ పెరుగుతుంది. మిత్రులతో విరోధం గోచరిస్తోంది. శ్రీఆంజనేయ స్వామిని పూజించండి.


ధనుస్సు :

ఆకాంక్ష నెరవేరుతుంది. శుభవార్త అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశించినట్లే సాగుతాయి. అజ్ఞాత వ్యక్తుల సహకారం లభిస్తుంది. సంతాన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. రోజంతా సంతోషంగా గడుపుతారు.


మకరం :

వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. అన్ని వర్గాల తోడ్పాటు లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


కుంభం :

తండ్రికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగవు. కలహాలకు ఆస్కారం ఉంది. అశాంతి పెరుగుతుంది. శత్రువుల బెడద పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శ్రీసీతారామ సహిత మారుతిని పూజించండి.


మీనం :

పనులకు ఆటంకాలుంటాయి. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. పెద్దల కోపానికి గురవుతారు. తగాదాలకూ ఆస్కారం ఉంది. మోకాలి నొప్పులు వేధిస్తాయి. గణపతిని పూజించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories