Today Horoscope in Telugu: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..17 July 2024

Rashi Phalalu Daily Horoscope For 17th July 2024 Wednesday In Telugu
x

Today Horoscope in Telugu: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..17 July 2024

Highlights

Today Horoscope in Telugu: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..17 July 2024

17-07-2024 (బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : ఏకాదశి రాత్రి గం.9.02 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి

నక్షత్రం: అనూరాధ అర్ధరాత్రి దాటాక గం.3.13 ని.ల వరకు ఆ తర్వాత జ్యేష్ట

అమృతఘడియలు: సాయంత్రం గం.4.23 ని.ల నుంచి గం.6.03 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.6.24 ని.ల నుంచి గం.8.04 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.56 ని.ల నుంచి గం.12.48 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.22 ని.ల నుంచి గం.2.00 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.51 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.54 ని.లకు


మేషం :

అనవసర ఆటంకాల వల్ల పనులు సవ్యంగా సాగవు. తగాదాల వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఆత్మీయులకు అవసరమైన సాయం చేయలేని స్థితి ఉంటుంది. శరీరంపై గాయాలయ్యే సూచన ఉంది.


వృషభం :

ప్రయత్నాలు సఫలమవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కీలకమైన వేళ విచక్షణను కనబరుస్తారు. ఇరుగు పొరుగుతో సఖ్యత ఉంటుంది. వాణిజ్య కార్యకలాపాలు లాభసాటిగా ఉంటాయి.


మిథునం :

సేవారంగంలోని వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. శత్రుపీడ తగ్గుతుంది.


కర్కాటకం:

కీలకమైన సమయంలో వివేకం చూపాల్సి వుంటుంది. ఆత్మీయుల సలహాలనూ తీసుకోండి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. లాటరీలు, జూదాలు కలిసిరావు. వినోదాలకు ఖర్చు చేస్తారు. వాత, జీర్ణ సమస్యలుంటాయి.


సింహం :

భూ సంబంధ సమస్యలుంటాయి. ఇంటి స్థలం కబ్జా కాకుండా శ్రద్ధ కనబరచండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. స్నేహితుల చికిత్స కోసం ఖర్చు చేయాల్సి వుంటుంది. సంతాన సంబంధ ఖర్చులు పెరుగుతాయి.


కన్య :

వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. బుద్ధి కుశలతను ప్రదర్శించి మెప్పును పొందుతారు. సమీప బంధువులను కలుస్తారు. ప్రచార, ప్రసార రంగాల్లోని వారికి అనుకూలం. అగ్రిమెంట్లకు అనువైన సమయం.


తుల :

ఆర్థిక వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు. క్రయ విక్రయాల్లో అప్రమత్తంగా ఉండాలి. తండ్రి ఆరోగ్యం కలవరపరుస్తుంది. కుటుంబ సభ్యుల తీరు చికాకు తెప్పిస్తుంది. సంభాషణల్లో తొందరపాటు మంచిది కాదు.


వృశ్చికం :

అదృష్టం అండగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ప్రశంసలు అందుతాయి. చక్కటి సౌకర్యాలను ఏర్పరచుకుంటారు.. కుటుంబ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు.


ధనుస్సు :

తొందరపాటు వల్ల ఆపదల్లో పడతారు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయులను సంప్రదించండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు.


మకరం :

ఆకాంక్షలు నెరవేరతాయి. ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయత్నాలు సాగుతాయి. శుభకార్యాలకు వెళతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.


కుంభం :

అభీష్టం నెరవేరుతుంది. మీ కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు.


మీనం :

ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కీలకాంశాల్లో సొంత నిర్ణయాలు వద్దు. సరికొత్త అంశాలపై అవగాహన పెరుగుతుంది. ప్రచురణ రంగంలోని వారికి బావుంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories