Today Horoscope in Telugu: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..12 July 2024

జులై 12వ తేదీ నేటి రాశి ఫలాలు
x

జులై 12వ తేదీ నేటి రాశి ఫలాలు

Highlights

Today Horoscope in Telugu 12 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 12 శుక్రవారం నాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

Today Horoscope in Telugu 12 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 12 శుక్రవారం నాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం.

తిధి : షష్ఠి మధ్యాహ్నం గం.12.32 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి.

నక్షత్రం: ఉత్తర సాయంత్రం గం.4.09 ని.ల వరకు ఆ తర్వాత హస్త.

అమృతఘడియలు: ఉదయం గం.8.01 ని.ల నుంచి గం.9.50 ని.ల వరకు.

వర్జ్యం: ఇవాళ అర్ధరాత్రి దాటాక గం.1.28 ని.ల నుంచి గం.3.26 ని.ల వరకు.

దుర్ముహూర్తం : ఉదయం గం.8.26 ని.ల నుంచి గం.9.19ని.ల వరకు తిరిగి మధ్యాహ్నం గం.12.48 ని.ల నుంచి గం.1.40 ని.ల వరకు.

రాహుకాలం : ఉదయం గం.10.44 నుంచి మధ్యాహ్నం గం.12.22 ని.ల వరకు.

సూర్యోదయం : తె.వా. గం.5.49 ని.లకు.

సూర్యాస్తమయం : సా. గం.6.55 ని.లకు.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)


వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. మీ స్వయంకృషికి ప్రశంసలు అందుతాయి. ధనలాభం ఉంది. చెడు అలవాట్లు మానే ప్రయత్నం అనుకూలిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)


అభీష్టం నెరవేర్చుకునేందుకు బాగా శ్రమించాల్సి వుంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకుంటారు. అనుమానాలు వీడి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి.

వాత సంబంధ సమస్యలుంటాయి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)


ప్రతి పనిలో అడ్డంకులుంటాయి. ఆర్థిక లావాదేవీలు కూడా సజావుగా సాగవు. విద్యారంగంలోని వారికి ప్రతికూల ఫలితాలుంటాయి. కార్యనష్టాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పార్వతీదేవిని పూజించండి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)


అనుకున్న కార్యాలు నెరవేరతాయి. ధనాదాయం పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొంటారు. మిత్రులు తోడుగా నిలుస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)


మాట పలుకుబడి తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చకండి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శ్రీలక్ష్మీనృసింహుణ్ణి పూజించండి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)


వృత్తి, ఉద్యోగాల్లో సత్ఫలితాలుంటాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కీలక వ్యవహారంలో అదృష్టం తోడవుతుంది. కీర్తి వృద్ధి చెందుతుంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)


పనులు అనుకున్నట్లుగా సాగవు. రహస్య శత్రువుల వల్ల ఇబ్బంది పడతారు. ఇతరులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వైద్యానికి ఖర్చు చేయాల్సి రావచ్చు. సాంత్వనకు సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)


రోజంతా సంతోషంగా గడుస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. అవసరమైన సదుపాయాలు ఏర్పరచుకుంటారు. సంతానం పురోభివృద్ధిలో సాగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)


వృత్తి, ఉద్యోగాల్లో అనువైన పరిస్థితులుంటాయి. ఇతరుల పోటీని అధిగమించి లాభాన్ని పొందుతారు. అధికారుల అండ లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. విందులో పాల్గొంటారు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)


బుద్ధి నిలకడగా ఉండదు. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. సంతానంతో ఘర్షణ వైఖరి ఉంటుంది. కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. అశాంతి పెరుగుతుంది. వృథా ఖర్చులుంటాయి. గణపతిని పూజించండి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)


ప్రతి పనిలోనూ ప్రతికూలతలే ఉంటాయి. వీలైనంత వరకు కీలక కార్యాలను వాయిదా వేయడం మేలు. సౌకర్యాలు అనుకున్న రీతిలో సమకూరవు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శనైశ్చరుడిని పూజించండి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)


మీనం :

సుఖశాంతులను పొందుతారు. సర్వత్రా విజయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు నెలకొంటాయి. బంధువులను కలుస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories