రాశిఫలం 26-12-2024 (గురువారం)

రాశిఫలం  26-12-2024 (గురువారం)
x
Highlights

రాశిఫలం26-12-2024 (గురువారం)కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షంతిధి : ఏకాదశి ఇవాళ అర్ధరాత్రి...

రాశిఫలం

26-12-2024 (గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : ఏకాదశి ఇవాళ అర్ధరాత్రి గం.12.43 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి

నక్షత్రం: స్వాతి సాయంత్రం గం.6.09 ని.ల వరకు ఆ తర్వాత విశాఖ

అమృతఘడియలు: ఉదయం గం.8.20 ని.ల నుంచి గం.10.07 ని.ల వరకు

వర్జ్యం: ఇవాళ అర్ధరాత్రి గం.12.18 ని.ల నుంచి గం.2.03 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.26 ని.ల నుంచి గం.11.10 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.52 ని.ల నుంచి గం.3.37 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.40 ని.ల నుంచి గం.3.03 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.43 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం. 5.48 ని.లకు

మేషం :

పనులు ఆశించిన స్థాయిలో జరుగుతాయి. వివిధ సౌఖ్యాలను పొందుతారు. బంధువులను కలుస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. వాహనయోగం ఉంది.

వృషభం :

అడ్డంకులను అవలీలగా దాటేస్తారు. చేపట్టిన పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. శారీరక సౌఖ్యం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పోయిందనుకున్న వస్తువు దొరుకుతుంది.

మిథునం :

కార్య నిర్వహణ సామర్థ్యం సన్నగిల్లుతుంది. బద్ధకం కూడా తోడవడంతో ఆశించిన ఫలితం లభించదు. వాత సంబంధ సమస్య వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. సంతానం తీరు బాధిస్తుంది. గురువులను కలుస్తారు.

కర్కాటకం:

పనులు ఆశించిన రీతిలో జరగవు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వృథా ఖర్చులను నియంత్రించాలి. తల్లివైపు బంధువుల గురించిన వర్తమానం అందుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త. ఆస్తి అమ్మే ప్రయత్నం వద్దు.

సింహం :

పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. అన్ని వర్గాల సహకారం లభిస్తుంది. ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. బోళాతనం మంచిది కాదు. సామర్థ్యానికి గుర్తింపు లభిస్తుంది. శుభవార్తను వింటారు.

కన్య :

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పలేక పోతారు. ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. అకారణ విరోధం ఉంది. కుటుంబంలో చికాకులు వస్తాయి. కంటి సమస్య ఉంటుంది.

తుల :

ఉన్నత స్థానం చేరేందుకు చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. చక్కటి అవకాశం అందిస్తుంది. బంధువులతో విందుకు హాజరవుతారు. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ధనలాభముంది.

వృశ్చికం :

వ్యవహారాల్లో నష్టం సంభవిస్తుంది. మానసిక దిగులు ఏర్పడుతుంది. బంధువులతో సఖ్యత చెడుతుంది. ఇతరుల కారణంగా ఇబ్బందులు వస్తాయి. దూర ప్రయాణం ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు :

ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు.

మకరం :

చేపట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. శుభవార్తను వింటారు. సహచరుల తోడ్పాటు లభిస్తుంది. వృత్తిపర నైపుణ్యానికి తగిన గుర్తింపును పొందుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

కుంభం :

పనులు నత్తనడకన సాగుతాయి. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. ఆర్థిక చికాకులు ఉంటాయి. వివాద పరిష్కారానికి ప్రయత్నించాలి. దూర ప్రయాణం గోచరిస్తోంది. అశాంతి, అలసట ఏర్పడతాయి.

మీనం :

ఇష్టం లేని పనిని చేయాల్సి వస్తుంది. నిర్దేశిత రీతిలో వ్యవహారాలు సాగవు. ఆర్థిక సమస్యలు వస్తాయి. కీళ్లకు సంబంధించిన సమస్య ఉంటుంది. తగాదాలకు దూరంగా ఉండండి. చెడు ఆలోచనలను నియంత్రించుకోవాలి.

శుభమస్తు

Show Full Article
Print Article
Next Story
More Stories