Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు ఆచితూచి వ్యవహరించాలి.. 12 రాశుల వారికి ఈరోజు రాశిఫలాలు

Horoscope today 08 October 2024
x

Horoscope today 08 October 2024

Highlights

Horoscope Today 08 October 2024: ఈరోజు 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Horoscope today 08 October 2024: ఈరోజు 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: పంచమి ఉదయం గం.6.58 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి

నక్షత్రం: జ్యేష్ట అర్ధరాత్రి గం.12.48 ని.ల వరకు

అమృతఘడియలు: సాయంత్రం గం.6.42 ని.ల నుంచి రాత్రి గం.8.25 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.8.25 ని.ల నుంచి గం.10.08 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.38 ని.ల నుంచి గం.9.25 ని.ల వకు మళ్లీ రాత్రి గం.10.55 ని.ల నుంచి గం.11.44 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.3.03 ని.ల నుంచి గం. 4.31 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.18 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.59 ని.లకు

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

కార్యనష్టం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వారసత్వ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. పోటీల్లో గెలవడం కష్టం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది.

వృషభం రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఆకాంక్ష నెరవేరుతుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సంతాన వ్యవహారాలు తృప్తిగా సాగుతాయి. ప్రయాణం వల్ల లబ్దిని పొందుతారు.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

అడ్డంకులను దాటేస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. పోయిన వస్తువు దొరికే అవకాశం ఉంది. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వస్తువులను కొంటారు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

బద్ధకం వల్ల ఇబ్బంది పడతారు. అభీష్టం నెరవేరే అవకాశం లేదు. విరోధాలు పెరుగుతాయి. వ్యవహారాల్లో సొంత తెలివితేటలను ఉపయోగించకండి. వృథా ఖర్చులు ఉంటాయి. విలువైన వస్తువులు జాగ్రత్త.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

బుద్ధి నిలకడగా ఉండదు. పనులు సవ్యంగా సాగవు. మానసిక అశాంతి పెరుగుతుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. మీ ఆలోచన తీరు వల్ల అవమానం ఎదురవుతుంది. బంధువులతో విరోధం గోచరిస్తోంది. జాగ్రత్త.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

మీ ఆలోచనలు కార్యరూపం ధరిస్తాయి. స్వయంకృషితో పాటు, సహచరుల తోడ్పాటూ మేలిమి ఫలితాలను అందిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

మనసులోని మాటలను సవ్యంగా చెప్పలేక ఇబ్బంది పడతారు. కుటుంబంలో స్వల్ప చిక్కులొస్తాయి. వేళకు భోజనం ఉండదు. ఆర్థిక వ్యవహారాలు ఆవేదనకు కారణమవుతాయి. కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకండి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

అదృష్టం తోడుగా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఉన్నత స్థాయికి చేరే ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది.. విందుకు హాజరవుతారు. మానసిక స్థితి ఉల్లాసంగా ఉంటుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

వ్యవహారాల్లో అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ముఖ్యంగా కోర్టు సంబంధ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి.వృథా ఖర్చులుంటాయి. బంధువులతో విరోధం గోచరిస్తోంది.జాగ్రత్త.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఆశించిన రీతిలోనే పనులు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఇష్టమైన వారితో విందుకు వెళతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. బంధాలు బలపడతాయి ఆనందంగా ఉంటారు.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)




అన్నింటా అనుకూల ఫలితాలుంటాయి. మేలిమి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగులు పైఅధికారుల మన్ననలను పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. ఇంట్లో శాంత నెలకొంటుంది. శారీరక సౌఖ్యం లభిస్తుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)



అడ్డంకులను అధిగమించి పనులు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగానే ఉంటాయి. గురుతుల్యులను కలుస్తారు. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఉదర సమస్యలుంటాయి.

Read Latest Astrology News and Telugu News

Show Full Article
Print Article
Next Story
More Stories