Astro Tips: కష్టపడి చదివినా పరీక్షల్లో మంచి మార్కులు రావడం లేదా..!

Even if you Study Hard you will not get Good marks in Exams According to Astrology do this
x

Astro Tips: కష్టపడి చదివినా పరీక్షల్లో మంచి మార్కులు రావడం లేదా..!

Highlights

Astro Tips: కొంతమంది స్టూడెంట్స్‌, నిరుద్యోగులు చాలా కాలంగా ప్రిపరేషన్‌ అవుతుంటారు. కానీ పరీక్షల్లోమాత్రం మంచి మార్కులు రావు.

Astro Tips: కొంతమంది స్టూడెంట్స్‌, నిరుద్యోగులు చాలా కాలంగా ప్రిపరేషన్‌ అవుతుంటారు. కానీ పరీక్షల్లోమాత్రం మంచి మార్కులు రావు. అన్నీ తెలిసినట్లే ఉంటాయి కానీ పరీక్షల్లో ఏమీ రాయలేరు. రాత్రి, పగలు కష్టపడినా పరీక్షల్లో మంచి మార్కులు రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతుంటారు. ఒక్కోసారి డిప్రెషన్‌లోకి వెళుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రెమిడీస్‌ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పాజిటివ్‌ ఫలితాలు సంభవిస్తాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. హనుమాన్ చాలీసా, సుందర‌కాండ్, రామచరితమానస్, దుర్గా చాలీసా మొదలైన మతపరమైన పుస్తకాలను ఆలయంలో దానం చేయాలి.

2. నలుపు, తెలుపు దుప్పట్లను మతపరమైన ప్రదేశాల్లో పేదలకు దానం చేయాలి.

3. ప్రతిరోజు ఉదయం పక్షులకు ఆహారం ఇవ్వాలి. ఈ పని కోసం ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఎందుకంటే పక్షులు ప్రతిరోజూ అదే సమయానికి అక్కడికి వస్తాయి. అవి నిరాశ చెందకూడదు.

4. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల పఠనం పట్ల ఆసక్తి ఏర్పడి మైండ్ షార్ప్‌గా మారుతుంది. హనుమంతుడు కూడా బలం, తెలివి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

5. చదువులో బలహీనంగా ఉన్న విద్యార్థులు ఉదయాన్నే నిద్రలేచి సరస్వతి మాతను ఆరాధిస్తూ.. సరస్వతీ చాలీసా పఠించాలి.

6. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4:00 గంటల నుంచి చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పరీక్ష రాస్తున్నప్పుడు తాజాగా ఉంటారు.

7. నుదుటిపై ఎల్లప్పుడు బొట్టు పెట్టుకోవాలి. దీనివల్ల ఏకాగ్రత కుదురుతుంది. సబ్జెక్టులను గుర్తుంచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories