Vastu Tips: కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Entering A New House Definitely Remember These Things According To Vastu Shastra
x

Vastu Tips: కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Highlights

Vastu Tips: వాస్తు శాస్త్రం శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లోకి ఆనందం, అభివృద్ధి తీసుకురావడానికి చాలా విషయాలు చెప్పారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లోకి ఆనందం, అభివృద్ధి తీసుకురావడానికి చాలా విషయాలు చెప్పారు. ఈ నియమాలు పాటిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త ఇంటికి సంబంధించిన ప్రత్యేక నియమాలు వాస్తులో పేర్కొన్నారు. వాస్తు ప్రకారం కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేదంటే అది వాస్తు దోషం అవుతుంది. దీంతో మీరు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఏయే అంశాలను గుర్తుంచుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఇంటి లోపల పసుపు రంగు తెరలు వేయండి. పసుపు ద్రావణాన్ని ఇల్లు మొత్తం చల్లాలి. ఇది శుభ గ్రహం బృహస్పతి ఆశీర్వాదాలను తెస్తుంది. అతడి ఆశీర్వాదంతో కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కొత్త ఇంట్లో వాస్తు దోషం లేకుండా ఉండాలంటే తెల్ల బియ్యం లేదా కర్పూరం దానం చేయాలి. ఇంటి గోడలకు నీలం, ఆకుపచ్చ, తెలుపు వంటి శుభ రంగులతో రంగులు వేయాలి. ఇది కుటుంబ సభ్యుల మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీని తీసుకువస్తుంది.

ఉదయం పూట సూర్యకాంతి పొందే విధంగా ఇల్లు ఉండాలి. ఇంట్లో చీకటి ఉంటే అది వాస్తు దోషం అవుతుంది. ఇది దురదృష్టం, అనారోగ్యం, దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు కొత్త ఇంటికి మారిన వెంటనే ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటే ఆవాల నూనెను దానం చేయాలి. శనివారం సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర నూనె దీపం వెలిగించాలి. కొత్త ఇంటిలో సంతోషం, శాంతికి విఘాతం కలిగితే ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్‌ యంత్రాన్ని అమర్చాలి. ప్రధాన ద్వారం దగ్గర గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

కొత్త ఇంట్లో వాస్తు దోష నిర్మూలన యంత్రం ఏర్పాటు చేసుకోవాలి. లాఫింగ్ బుద్ధ, క్రిస్టల్ తాబేలు ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. ప్రతిరోజూ ఉప్పుతో ఇంటిని తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories