Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (16/1/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (16/1/2025)

Highlights

Daily Horoscope Today In Telugu, January 16, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, January 16, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.


మేషం

అడ్డంకులు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆత్మీయుల సూచన పాటించండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. సామర్థ్యాన్ని మెరుగు పరచుకోవాల్సిన సమయమిది. బద్ధకం వదలండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

వృషభం

అనుకూల ఫలితాలుంటాయి. ఆదాయం మెరుగవుతుంది. కుటుంబ సౌఖ్యమూ లభిస్తుంది. సోదరులు తోడుంటారు. బుద్ధి నిలకడ లేమి వల్ల బంధువులతోనే గొడవలు వస్తాయి. వృథా ఖర్చులు కలవర పరుస్తాయి.

మిథునం

పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆత్మీయులు సహకరిస్తారు. ప్రయాణం లాభిస్తుంది. అనవసర జోక్యం వద్దు. వేళకు భోజనం ఉండదు.

కర్కాటకం

అన్ని పనులు ఆశించినట్లే జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మనశ్శాంతి ఉండదు. మాట నిలుపుకోని కారణంగా అవమానం ఎదురవుతుంది.

సింహం

ఉల్లాసంగా గడుపుతారు. అవసరానికి డబ్బు అందుతుంది. విందులో పాల్గొంటారు. మీ అభివృద్ధి బాటలు వేసుకుంటారు. గౌరవం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. మనశ్శాంతిని కోల్పోతారు.

కన్య

పనులు సఫలం అవుతాయి. బంధువులతో విందులో పాల్గొంటారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. కొత్త పరిచయం ఏర్పడుతుంది. నైపుణ్యాభివృద్ధికి అనువైన రోజు. ఆకస్మిక ప్రయాణం ఉంది. నిద్రలేమి వేధిస్తుంది.

తుల

యోగదాయకంగా ఉంటుంది. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వృత్తిపరమైన నైపుణ్యం ప్రదర్శిస్తారు. మేలిమి అవకాశం సొంతమవుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆరోగ్యం బావుంటుంది. సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం

ప్రారంభంలో ఒడుదుడుకులు ఎదురైనా చేపట్టిన పనులన్నీ సఫలం అవుతాయి. ఇష్ట కార్యం నెరవేరుతుంది. విందులో పాల్గొంటారు. గృహంలో శాంతి నెలకొంటుంది. గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

ధనుస్సు

కార్యసాధనలో అడ్డంకులు ఎదురవుతాయి. లక్ష్యసాధనలో వైఫల్యం గోచరిస్తోంది. శత్రుపీడ పెరుగుతుంది. తగాదాలు వద్దు. పెద్దల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త. ఆధ్యాత్మిక ధోరణి మేలు చేస్తుంది.

మకరం

భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక చికాకులుండవు. విందులో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణం లాభిస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

కుంభం

ఆనందోత్సాహాలతో గడుపుతారు. ఆత్మీయులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. బంధాలు బలపడతాయి. అపార్థం తొలగిపోతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

మీనం

ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఆర్థికస్థితి నిలకడగా ఉంటుంది. సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది. గొడవలు పెరిగే సూచన ఉంది. సంయమనంతో ఉండండి.

Show Full Article
Print Article
Next Story
More Stories