Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (15/1/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (15/1/2025)

Highlights

Daily Horoscope Today In Telugu, January 15, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, January 15, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

మేషం

మీలాంటి మనస్తత్వం కలవారు పరిచయం అవుతారు. రహస్యం బట్టబయలయ్యే సూచన ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి పనికీ అడ్డంకి వస్తుంది. బంధు విరోధం గోచరిస్తోంది.

వృషభం

కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలకు కార్యరూపమిస్తారు. చేపట్టిన ప్రతిపనీ విజయవంతం అవుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఇరుగుపొరుగు సహకరిస్తారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది.

మిథునం

కుటుంబ సభ్యుల తీరు కొంత ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకున్నట్లుగా సాగవు. వేళకు భోజనం ఉండదు. ఇతరుల విషయాల్లో జోక్యం వల్ల సమస్యలు వస్తాయి. గొడవల వల్ల మనశ్శాంతి ఉండదు.

కర్కాటకం

ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన కార్యాలు సఫలం అవుతాయి. జీవితంలో పురోభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. కీర్తి పెరుగుతుంది. విందుకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

సింహం

పనులు ఆశించిన స్థాయిలో జరగవు. మనసు కలతబారుతుంది. బద్ధకం వీడి కష్టపడితే కొంతైనా సత్ఫలితాలు వస్తాయి. బంధువుల్లో ఒకరికి ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. వృథా ఖర్చులుంటాయి. దూరప్రయాణం ఉంది.

కన్య

సంతోషంగా గడుపుతారు. అన్ని పనులూ విజయవంతం అవుతాయి. సంతాన సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. బంధువులతో విందువినోదాల్లో పాల్గొంటారు. అభీష్టం నెరవేరుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.

తుల

జీవితంలో ఎదిగేందుకు ఉపయోగపడే మేలిమి అవకాశాలు అందివస్తాయి. పెద్దల అభిమానాన్ని పొందుతారు. బంధువులతో వినోదంగా గడుపుతారు. ప్రత్యర్థులను జయిస్తారు. దూరప్రాంత నివాస యత్నం ఫలిస్తుంది.

వృశ్చికం

బలహీనతలను అధిగమించాలి. బద్ధకాన్ని వదిలి కష్టపడితే కార్యాలు విజయవంతం అవుతాయి. దూర ప్రయాణముంది. పెద్దలను కలుస్తారు. తొందరపాటు వల్ల పరిహారం చెల్లిస్తారు. జీర్ణ సంబంధ సమస్య వస్తుంది.

ధనుస్సు

అనుకున్న రీతిలో పనులు సాగవు. మనసుకి కష్టంగా ఉంటుంది. పెద్దల కోపానికి గురవుతారు. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. తగాదాలు వద్దు. ఆస్తి వ్యవహారాలు అనుకూలించవు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మకరం

అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. నిజాయితీకి గుర్తింపుఉంటుంది. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి.

కుంభం

రోజంతా శుభప్రదంగా సాగుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కొత్త వస్తువులను కొంటారు. బంధు, మిత్రులను కలుస్తారు. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. వివాదం పరిష్కారం అవుతుంది. మనశ్శాంతి ఉంటుంది.

మీనం

వృథా ఖర్చులు తగ్గించాలి. అభీష్టం నెరవేరదు. ఇతరుల వ్యవహారంలో జోక్యం వల్ల విరోధం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు మేలు. సంతానం తీరు చికాకు పెడుతుంది. వాత సమస్య వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories