Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (10/1/2025)

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (10/1/2025)
x
Highlights

Daily Horoscope Today In Telugu, January 10, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, January 10, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం

తిధి : ఏకాదశి ఉదయం గం.10.19 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి

నక్షత్రం: కృత్తిక మధ్యాహ్నం 1.45 ని.ల వరకు ఆ తర్వాత రోహిణి

అమృతఘడియలు: ఉదయం గం.11.29 ని.ల నుంచి మధ్యాహ్నం గం.1.00 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి దాటాక తె.వా గం.4.54 ని.ల నుంచి గం.6.25 ని.ల వరకు

దుర్ముహూర్తం :ఉదయం గం.9.05 ని.ల నుంచి గం.9.50 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.50 ని.ల నుంచి గం. 1.35 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.45 ని.ల నుంచి గం.12.28 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.50 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం.6.05 ని.లకు

మేషం :

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. ఇతరుల వల్ల తలెత్తిన సమస్యను పరిష్కరిస్తారు. పనుల్లో ఆటంకాలతో చికాకు పెరుగుతుంది. వేళకు భోజనం ఉండదు. తగాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త.

వృషభం :

కార్యనిర్వహణలో సఫలం అవుతారు. ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ఎదిగేందుకు చక్కటి అవకాశం అంది వస్తుంది. కీర్తిపెరుగుతుంది. ఉద్యోగులు శుభ ఫలితాలను పొందుతారు. బంధువులతో విందుకు హాజరవుతారు.

మిథునం :

పనులకు అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. మనసుకి కష్టం కలిగే ఘటన ఎదురవుతుంది. సమయస్ఫూర్తితో కార్యాలు సాధించుకోవాలి. మిత్రులతో సఖ్యతను పెంచుకోండి. ఇతరుల వ్యవహారాల్లో అనవసర జోక్యం వద్దు.

కర్కాటకం:

వ్యవహార లాభముంది. పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయులను కలుస్తారు. అవసరమైన సహకారం లభిస్తుంది. విందుకు వెళతారు. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి.

సింహం :

చేపట్టిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. గౌరవం పెరుగుతుంది. నిపుణులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

కన్య :

కార్యనిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తు గురించిన ఆలోచనలు వస్తాయి. బలహీనతలను అధిగమించాలి. దూర ప్రాంతానికి వెళతారు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

తుల :

కార్య సాధనకు బాగా శ్రమించాల్సి వుంటుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు బాగా ఇబ్బంది పడతారు. ఇష్టంలేని చోటుకి వెళ్లాల్సి వస్తుంది. కోపాన్ని నియంత్రించాలి. పైత్య సంబంధ సమస్య ఉంటుంది.

వృశ్చికం :

అన్ని ప్రయత్నాలూ ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి.

ధనుస్సు :

పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. వివాదం పరిష్కారమవుతుంది. అదృష్టం వరిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు.

మకరం :

ప్రతికూల ఆలోచనలను వదిలేయాలి. అనుమానం, నిరాశను దూరం చేయాలి. అప్పుడే కార్యసాధనలో మంచి ఫలితాన్ని పొందుతారు. సంతానం తీరు చికాకు పెడుతుంది. అనవసరంగా తెలివితేటలను ప్రదర్శించకండి.

కుంభం :

ప్రతి పనికీ అడ్డంకి ఎదురవుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల పనులు చెడిపోతాయి. వృథా ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల వైఖరి బాధిస్తుంది. ఆస్తి లావాదేవీలు వాయిదా వేయండి. మనశ్శాంతి ఉండదు.

మీనం :

వ్యవహారాల్లో విశేష లాభం ఉంటుంది. నాయకత్వ లక్షణం ప్రదర్శిస్తారు. సాహసోపేత నిర్ణయాలకు చక్కటి ప్రతిఫలం లభిస్తుంది. సోదరులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ఆత్మీయులను కలుస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories