Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (20/12/2024)

Daily Horoscope Today
x

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (20/12/2024)

Highlights

Daily Horoscope Today In Telugu, December 20, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, December 20, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం

తిధి: పంచమి ఉదయం గం.10.48 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి

నక్షత్రం: మఖ అర్ధరాత్రి దాటిన తర్వాత తె.వా. గం.3.47 ని.ల వరకు ఆ తర్వాత పుబ్బ

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటాక గం.1.12 ని.ల నుంచి గం.2.55 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.2.51 ని.ల నుంచి గం.4.36 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.54 ని.ల నుంచి గం.9.39 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.36 ని.ల నుంచి గం.1.21 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.10.50 ని.ల నుంచి గం.12.15 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.40 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.46 ని.లకు

మేషం

పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అభీష్టం నెరవేరే అవకాశం లేదు. ధన సంబంధ వ్యవహారాల్లో మనోవ్యధ కలుగుతుంది. మీ విశ్లేషణలకు తగిన గుర్తింపు లభించదు. నిరాశను దూరం చేసి, స్థిరచిత్తంతో కృషి చేయండి.

వృషభం

వ్యవహారాల్లో జాగ్రత్త. భూలావాదేవీల్లో తొందరపాటు నిర్ణయం వల్ల ఇబ్బంది పడతారు. వాహన సంబంధ సమస్య వస్తుంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు బెడిసికొడతాయి. వృథా ఖర్చులు తగ్గించండి.

మిథునం

పనులు సజావుగా సాగుతాయి. ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో విశేష లాభం ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇరుగుపొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది.

కర్కాటకం

జీవిత భాగస్వామితో అకారణ విరోధానికి ఆస్కారముంది. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టండి. హామీని నెరవేర్చే ప్రయత్నం చేయండి. కంటికి సంబంధించిన సమస్యను నిర్లక్ష్యం చేయకండి. ఖర్చు తగ్గించండి.

సింహం

ఆకాంక్ష నెరవేరుతుంది. ప్రతి పనీలోనూ మెరుగైన ఫలితాలను పొందుతారు. సామాజిక అంశాలపై అవగాహనను పెంచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. వాహనయోగం ఉంది. మానసికప్రశాంతత లభిస్తుంది.

కన్య

వ్యవహారాలు ఆశించిన స్థాయిలో సాగవు. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ప్రయాణాలు లాభించవు. వేళకు భోజనముండదు. అపాత్రదానం మంచిది కాదు. న్యాయసంబంధ సమస్య వస్తుంది. మనశ్శాంతి ఉండదు.

తుల

కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కీలక వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. రుణ విముక్తి యత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు.

వృశ్చికం

ఇష్టకార్యం నెరవేరుతుంది. బంధువులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఇతరులతో విరోధం ఏర్పడినా, మిత్రుల అండగా మీకే విజయం లభిస్తుంది. కుటుంబ వ్యవహారలు తఈప్తినిస్తాయి. గౌరవం పెరుగుతుంది.

ధనుస్సు

పనులు నత్తనడకన సాగుతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యే సూచన ఉంది. సంతానం తీరుతో కోపమొస్తుంది. గౌరవం సన్నగిల్లే సూచన ఉంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.

మకరం

చేపట్టిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొత్తవారితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ ఆనందాన్ని పొందుతారు.

కుంభం

సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. పెద్దల అండదండలతో బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక లబ్దిని పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రాజీ మార్గంలో సమస్యలను పరిష్కరించుకుంటారు.

మీనం

అనుకున్న స్థాయిలో పని జరగదు. ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకాన్ని విడిచిపెట్టాలి. చెడు ఆలోచనలను వదిలిపెట్టాలి. వాత సంబంధ సమస్య వస్తుంది. వృథా ఖర్చు తగ్గించాలి. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్గ.

Show Full Article
Print Article
Next Story
More Stories