Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (19/12/2024)

Daily Horoscope Today
x

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (19/12/2024)

Highlights

Daily Horoscope Today In Telugu, December 19, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, December 19, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.


మేషం

విద్య, సేవా రంగాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల కోపానికి గురవుతారు. మనసు ఒత్తిడికి గురవుతుంది. బుద్ధి నిలకడ లేమి వల్ల బంధువులతోనే విరోధం వస్తుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

వృషభం

అన్ని రకాల ప్రయత్నాలూ అనుకూలిస్తాయి. ధనలాభం ఉంది. సోదరుల సహకారం లభిస్తుంది. నాయకత్వ లక్షణానికి తగ్గ గౌరవం లభిస్తుంది. ఆలోచనలు సవ్యంగా సాగుతాయి. అవసరమైన సమాచారం అందుతుంది.

మిథునం

మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పలేక నిందల పాలవుతారు. ముందుచూపు లేని నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. బ్యాంకు వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోకండి. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం

ఉత్సాహంగా గడుస్తుంది. మెరుగైన స్థితి కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. ఆయా రంగాల్లోని వారు ముందంజలో ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అదృష్టం వరిస్తుంది.

సింహం

వ్యవహారాలు ఆశించిన రీతిలో సాగవు. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర జోక్యాలు చేసుకోకండి. వీలైనమేరకు ప్రయాణాలను వాయిదా వేయండి. వేళకు భోజనముండదు. వృథా ఖర్చులను నియంత్రించండి.

కన్య

లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇష్టమైన వారితో గడుపుతారు. డబ్బుకి సంబంధించిన వ్యవహారాలు తృప్తినిస్తాయి. మిత్రుల సహకారాన్ని పొందుతారు. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల

ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలమవుతాయి. కీలక సమయంలో స్థిర నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యర్థులను గెలుస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉపాధి మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.

వృశ్చికం

అనుకున్న రీతిలో పనులు కావు., ధన సంబంధ వ్యవహారాల్లో జాగ్రత్త. ఉదర సంబంధ సమస్య వస్తుంది. సంతానంతో సఖ్యత చెడుతుంది. అశాంతి పెరుగుతుంది. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి వృద్ధి చెందుతుంది.

ధనుస్సు

పనులు అనుకున్నట్లుగా జరగకపోవడం ఆవేదనను కలిగిస్తుంది. చెప్పుడు మాటలు నమ్మకుండా స్వీయ విచక్షణతో అభిప్రాయాలు ఏర్పరచుకోండి. తగాదాలకు దూరంగా ఉంటూ సంయమనాన్ని పాటించండి.

మకరం

వ్యవహార జయం ఉంది. ఆర్థిక లావాదేవీలు లాభాన్నిస్తాయి. సంతాన సంబంధ శుభవార్తను వింటారు. ప్రయాణం లాభిస్తుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి.

కుంభం

చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. సహచరులకు మీపై విశ్వాసం పెరుగుతుంది. శారీరక సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.

మీనం

బద్ధకం వల్ల చిక్కులు పెరుగుతాయి. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. కీలక నిర్ణయాల్లో మిత్రుల సహకారం తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వృథా ఖర్చు తగ్గించాలి.

ALSO READ: Telugu Panchangam Today: ఈరోజు పంచాంగం, తిథి, నక్షత్రం, డిసెంబర్ 19, 2024

Show Full Article
Print Article
Next Story
More Stories