Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (16/12/2024)

Daily Horoscope Today
x

Daily Horoscope Today In Telugu December 16, 2024

Highlights

Daily Horoscope Today In Telugu, December 16, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, December 16, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

మేషం

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరుల సహకారంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. చాలాకాలంగా ఎదురు చూస్తున్న సమాచారం ఆనందింప చేస్తుంది. అదృష్టం తోడుంటుంది.

వృషభం

నోటి దురుసు వల్ల సమస్యలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించినట్లుగా సాగవు. వేళకు భోజనం ఉండదు. ఎవరికీ పూచీగా ఉండకండి. ప్రయాణం వద్దు. ఉద్యోగులు విధినిర్వహణలో అజాగ్రత్తగా ఉంటే నష్టపోతారు.

మిథునం

నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటారు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది.

కర్కాటకం

పనులు అనుకున్న స్థాయిలో జరగవు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేసి దండనకు గురయ్యే సూచన ఉంది. నిద్రలేమి వేధిస్తుంది. దూర ప్రయాణం ఉంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వేళకు భోజనం ఉండదు.

సింహం

రోజంతా ఉల్లాసంగా సాగుతుంది. ఆర్థికంగా చక్కటి ప్రయోజనాన్ని పొందుతారు. సంతాన సంబంధ సౌఖ్యం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందుకు హాజరవుతారు. ఆత్మీయుల కలయిక కొత్త ఉత్తేజాన్నిస్తుంది.

కన్య

ఇష్టసిద్ధి కలుగుతుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. అవకాశాలు కలిసివస్తాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

తుల

పనుల పూర్తికి ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. తండ్రితో సఖ్యత చెడుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. కడుపులో సమస్య తలెత్తుతుంది. గురుతుల్యులను కలుస్తారు.

వృశ్చికం

అన్ని వ్యవహారాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. డబ్బు లావాదేవీల్లో అజాగ్రత్త వల్ల భారీ నష్టం ఏర్పడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు సంయమనం పాటించాలి. వేళకు భోజనముండదు. కీళ్ల సమస్యలు వేధిస్తాయి.

ధనుస్సు

ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. బంధువులు సహకరిస్తారు. బంధాలు బలపడతాయి. ప్రయాణం ఆనందకరంగా ఉంటుంది.

మకరం

కార్యాలు విజయవంతం అవుతాయి. ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. చర్చలతో వివాదాలను పరిష్కరించుకుంటారు. బలహీనతలను అధిగమిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

కుంభం

కార్య నిర్వహణలో బద్ధకించడం వల్ల చిక్కులు వస్తాయి. అభీష్టం నెరవేరే సూచన లేదు. ఆలోచనలను అదుపు చేసుకోవాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వాత సమస్య ఉంటుంది.

మీనం

బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఆత్మీయుల వల్లే సమస్యలు వస్తాయి. నిద్రలేమి వేధిస్తుంది. మనశ్శాంతి లోపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories