Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Daily Horoscope In Telugu Rasi Phalalu Panchangam Today 7th June
x

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Highlights

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

(తేది 07-06-2024 : శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, శుక్లపక్షం

తిధి : పాడ్యమి సాయంత్రం గం.4.44 ని.ల వరకు ఆ తర్వాత విదియ

నక్షత్రం: మృగశిర సాయంత్రం గం.7.43 ని.ల వరకు ఆ తర్వాత ఆరుద్ర

అమృతఘడియలు: ఉదయం గం.11.07 ని.ల నుంచి గం.12.41 ని.ల వరకు

వర్జ్యం: రేపు తె.వా.గం.4.07 ని.ల నుంచి గం.5.42 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉ.గం.8.19 ని.ల నుంచి గం.9.11 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.41 ని.ల నుంచి గం.1.34 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.37 ని.ల నుంచి గం.12.15 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం 5.41 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.49 ని.లకు


మేషం :

శుభ ఫలితాలను అందుకుంటారు. ఆదాయం మెరుగవుతుంది.రాజీ ప్రయత్నాలు విశేష లాభదాయకంగా ఉంటాయి. అగ్రిమెంట్లు కుదుర్చుకునేందుకు అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.


వృషభం :

అనుకున్నవి నెరేవేరవు. మనసుకి కష్టంగా ఉంటుంది. ఇతరుల వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. మాట తూలకండి. కుటుంబంలోనూ స్వల్ప చికాకులుంటాయి. వేళకు భోజనం ఉండదు. దుర్గమ్మను పూజించండి.


మిథునం :

కార్యసాధనలో విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. విద్యార్థులు, ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.


కర్కాటకం:

కార్యసాధనకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. జరుగుతున్న పరిణామాలు మనసుని కలతబారుస్తాయి. అనూహ్య ఖర్చులుంటాయి. మిత్రులతోనూ విరోధం గోచరిస్తోంది. ఆంజనేయ స్వామిని పూజించండి.


సింహం :

సౌఖ్యంగా గడుపుతారు. వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. విందుల్లో పాల్గొంటారు. గృహావసరాలను తీరుస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవసరమైన సహాయం అందుతుంది.


కన్య :

పట్టింది బంగారంలా సాగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో శాంతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


తుల :

కార్యసాధనలో ఒడుదుడుకులుంటాయి. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. తండ్రి నుంచి సహకారం అందదు. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. అలసటకు గురవుతారు. సుబ్రహ్మణ్యుడిని పూజించండి.


వృశ్చికం :

అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. ఆవేశంతో మాట తూలడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. పైత్య సమస్యలుంటాయి. శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించండి.


ధనుస్సు :

రోజంతా తృప్తికరంగా సాగుతుంది. ధనలాభం ఉంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. శారీరక, మానసిక శాంతిని పొందుతారు.


మకరం :

ఆశించిన ఫలితాన్ని పొందుతారు. చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. డబ్బు సమస్య ఉండదు. బంధువులు తోడుగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీర్తి పెరుగుతుంది.


కుంభం :

సొంత తెలివిని వాడకండి. పెద్దల సూచనలను పాటించండి. సంతాన వ్యవహారాలు చికాకు పరుస్తాయి. వృథా ఖర్చులుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. విలువైన వస్తువులను జాగ్రత్త పరచుకోండి.


మీనం :

అయినవారితోనే విరోధం గోచరిస్తోంది. పనుల్లో నష్టం జరుగుతుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లక్ష్మీనరసింహ స్వామిని పూజించండి.Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Show Full Article
Print Article
Next Story
More Stories