Horoscope: ఈ రాశి వారికి మిత్రులే విరోధులయ్యే అవకాశం.. ఆచితూచి అడుగేస్తే, అన్నీ శుభశకునములే..
Horoscope: ఈ రాశి వారికి మిత్రులే విరోధులయ్యే అవకాశం.. ఆచితూచి అడుగేస్తే, అన్నీ శుభశకునములే..
(తేది: 29-05-2024, బుధవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం
తిధి : షష్ఠి మధ్యాహ్నం గం.1.39 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి
నక్షత్రం: శ్రవణము ఉదయం గం.8.38 ని.ల వరకు ఆ తర్వాత ధనిష్ట
అమృతఘడియలు: రాత్రి గం.9.36 ని.ల నుంచి గం.11.08 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం. 12.27 ని.ల నుంచి గం.1.59 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉ. గం.11.48 ని.ల నుంచి గం. 12.40 ని.ల వరకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.12.41 ని.ల నుంచి గం.1.52 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం 5.41 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.46 ని.లకు
మేషం :
ఆకాంక్ష నెరవేరుతుంది. అయినవారు సహాయం చేస్తారు. కొత్త పరిచయాల ద్వారా సరికొత్త విషయాలను తెలుసుకుంటారు. సంతానంతో వినోదంగా గడుపుతారు. ఆరోగ్యం బావుంటుంది. విందుల్లో పాల్గొంటారు.
వృషభం :
వృత్తి ఉద్యోగాల్లోని వారికి శుభప్రదంగా ఉంటుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శాంతి ఉంటుంది.
మిథునం :
కార్యసాధనలో అలసిపోతారు. అయినవారే శత్రువులవుతారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. బలహీనతలను బయటపెట్టకండి. సంతానం వల్ల చికాకులుంటాయి. ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది.
కర్కాటకం:
పనులు అనుకున్నట్లుగా సాగవు. అప్రమత్తంగా ఉండండి. నోటిదురుసు తగ్గించుకోండి. లేకుంటే పెద్దల ఆగ్రహానికి గురయ్యే వీలుంది. అనుమానాలను వదిలిపెట్టి ముందుకు సాగండి. గణపతిని పూజించండి.
సింహం :
అందరితో స్నేహభావం బలపడుతుంది. శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. కొత్త విషయాలను ఆకళింపు చేసుకోవడానికిది శుభతరుణం. ప్రయాణాలు సఫలమవుతాయి. బంధుమిత్రులను కలుస్తారు.
కన్య :
శుభ ఫలితాలుంటాయి. అవసరానికి తగ్గంత డబ్బు సమకూరుతుంది. ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. అధికారుల మన్ననలు పొందుతారు. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది.
తుల :
అభీష్టం నెరవేరేందుకు బాగా కష్టపడాల్సి వుంటుంది. ఇరుగుపొరుగు వారితో సఖ్యత చెడుతుంది. సొంత తెలివితేటలు పనిచేయవు. మిత్రుల తోడ్పాటు తీసుకోండి. ఖర్చు తగ్గించాలి. సుబ్రహ్మణ్యుడిని దర్శించండి.
వృశ్చికం :
సంకల్పం నెరవేరే క్రమంలో అడ్డంకులొస్తాయి. జీవితభాగస్వామి వృత్తి జీవితం సమస్యల్లో పడుతుంది. భూసంబంధ వ్యవహారాలు వాయిదా వేసుకోండి. బంధువిరోధం సూచిస్తోంది. దుర్గాదేవిని పూజించండి.
ధనుస్సు :
శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన కార్యాల్లో విశేష లాభముంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సోదరులు తోడుగా నిలుస్తారు. కుటుంబ చికాకులు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మకరం :
పనులు అనుకున్న రీతిలో సాగవు. ఆర్థిక, బ్యాంకు వ్యవహారాల్లో జాప్యం ఏర్పడుతుంది. ఇతరుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృథాఖర్చులుంటాయి. వేళకు బోజనముండదు. శనైశ్చరుణ్ణి పూజించండి.
కుంభం :
అన్ని రంగాల్లోని వారికీ శుభప్రదంగా ఉంటుంది. అభీష్టాలు నెరవేరతాయి. ఉద్యోగాల్లోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. మానసిక శాంతిని పొందుతారు. విందుల్లో పాల్గొంటారు.
మీనం :
అడుగడుగునా ఆటంకాలు సృష్టించేవారు పెరుగుతారు. మిత్రులే విరోధులయ్యే సూచన ఉంది. ఇతరులతో వ్యవహారాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర ప్రయాణాలు మానేయండి. శివారాధన మేలు చేస్తుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire