Horoscope Today: 15-06-2024 శనివారం.. నేటి రాశి ఫలాలు...

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Today 15th June
x

Horoscope Today: 15-06-2024 శనివారం.. నేటి రాశి ఫలాలు...

Highlights

Today Horoscope in Telugu: 15-06-2024 శనివారం. నేటి రాశి ఫలాలు.

తేది: 15-06-2024 (శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : నవమి 16వ తేదీ తె.వా.గం 2.32 ని.ల వరకు ఆ తర్వాత దశమి

నక్షత్రం: ఉత్తర ఉదయం గం.8.14 ని.ల వరకు ఆ తర్వాత హస్త

అమృతఘడియలు: రేపు తె.వా. గం 4.28 ని.ల నుంచి గం.6.16 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.5.40 ని.ల నుంచి గం.7.28 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉద్యం గం.5.42 ని.ల నుంచి గం.7.27 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.8.59 ని.ల నుంచి గం.10.38 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.42 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.52 ని.లకు

మేషం : కోరిక నెరవేరుతుంది. కార్యాలు విజయవంతం అవుతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు.

వృషభం : శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనవసర విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అవసరానికి మీ మేధస్సు పనిచేయదు. ఆలోచనలు నీచంగా సాగుతాయి. నిరాశ అలముకుంటుంది. పార్వతీదేవిని పూజించండి.

మిథునం : ఆటంకాలు చికాకు పెడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆందోళనను కలిగిస్తాయి. ఆస్తి క్రయవిక్రయాలకు సరైన సమయం కాదు. అశాంతి ఏర్పడుతుంది. తల్లిపై శ్రద్ధ వహించాలి. సాంత్వన కోసం శివారాధన చేయండి.

కర్కాటకం: పనులు విజయవంతం అవుతాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్నేహితుల తోడ్పాటు లాభదాయకంగా ఉంటుంది.

సింహం : పనులు సవ్యంగా సాగవు. ఇతరుల జోక్యం చికాకు పెడుతుంది. అకారణ విరోధం గోచరిస్తోంది. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయండి. ఎవరికీ పూచీకత్తు ఉండకండి. నవగ్రహాలను పూజించండి.

కన్య: అదృష్టం తోడుగా నిలుస్తుంది. తలపెట్టిన కార్యాలన్నీ సఫలం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు ఆశించినట్లే ఉంటాయి. మీ కార్యదక్షతకు ప్రశంసలు వస్తాయి. విందుల్లో పాల్గొంటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది.

తుల: వ్యవహారాలు లాభదాయకంగా ఉండవు. ఇబ్బందులుంటాయి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. మనసు కలతబారుతుంది. వేళకు భోజనం ఉండదు. అవసరానికి మిత్రుల తోడ్పాటు అందదు. గణపతి పూజ మేలు.

వృశ్చికం : ఆనందదాయకమైన కాలమిది. పనులు చకచకా పూర్తవుతాయి. అన్నివైపులా సహకారం అందుతుంది. అవసరమైన సౌకర్యాలు సమకూరతాయి. విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ధనుస్సు :: అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉంటుంది. స్థిరచిత్తంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కీర్తి పెరుగుతుంది. అవకాశాలు కలిసివస్తాయి.

మకరం : పనులు అనుకున్నట్లుగా సాగవు. ఉద్యోగస్తులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. సంతానం తీరు చికాకు పరుస్తుంది. శత్రుపీడ వేధిస్తుంది. కనక దుర్గమ్మను పూజించండి.

కుంభం : పనులు అతి కష్లమ్మీద పూర్తవుతాయి. అనుకున్న మేరకు సౌకర్యాలు సమకూరవు. తగాదాలు వస్తాయి. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఉద్రేకాన్ని అదుపు చేసుకోవాలి. నవగ్రహారాధన మేలు చేస్తుంది.

మీనం : కార్యాలు అనుకున్నట్లే పూర్తవుతాయి. డబ్బుకి సమస్య ఉండదు. జీవిత భాగస్వామితో బంధం మరింత దృఢపడుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. కీర్తి పెరుగుతుంది. మానసికశాంతి లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories