Astro News: దీపావళి తర్వాత ఈ 3 రాశుల వారు పూజా ఫలాలను పొందుతారు.. అపారమైన సంపద మీ సొంతం..!

After Diwali These 3 Zodiac Signs Will Get The Fruits Of Pooja Immense Wealth Will Be Obtained
x

Astro News: దీపావళి తర్వాత ఈ 3 రాశుల వారు పూజా ఫలాలను పొందుతారు.. అపారమైన సంపద మీ సొంతం..!

Highlights

Astro News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాళవ్య రాజయోగం చాలా పవిత్రమైనది. జాతకంలో ఈ రాజయోగం ఉన్న వ్యక్తి జీవితంలోని ప్రతి ఆనందాన్ని పొందుతాడు.

Astro News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాళవ్య రాజయోగం చాలా పవిత్రమైనది. జాతకంలో ఈ రాజయోగం ఉన్న వ్యక్తి జీవితంలోని ప్రతి ఆనందాన్ని పొందుతాడు. జీవితంలో ఎప్పుడూ సంపద కొరతను ఎదుర్కోడు. ఈ నెలాఖరున అంటే నవంబర్ 30న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ పరిస్థితిలో ఈ 3 రాశుల వ్యక్తులు శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఈ అదృష్ట రాశుల వ్యక్తుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మకరరాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి మాలవ్య రాజ్యయోగం శుభాలు తెస్తుంది. ఈ సమయంలో కెరీర్‌కు సంబంధించిన ప్రతి విషయంలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఈ వ్యక్తులు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త ఆలోచనలతో పని చేస్తారు. అందులో విజయం కూడా పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమయంలో పితృ ఆస్తుల ప్రయోజనాన్ని పొందవచ్చు. శుక్రుడు మీ రాశికి ఐదవ ఇంటికి అధిపతి. ఈ పరిస్థితిలో మీరు సంతాన యోగాన్ని, ఊహించని ధనలాభాలను పొందుతారు.

తులారాశి

మాళవ్య రాజ్యయోగం వల్ల ఈ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. నవంబర్ 30న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ వర్కింగ్ స్టైల్ బాగుంటుంది. వ్యాపారస్తులు ఆర్థికంగా లాభపడతారు. కెరీర్‌కు సంబంధించిన అనేక బంగారు అవకాశాలను పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రాశిచక్రం ఎనిమిదవ ఇంటికి శుక్రుడు అధిపతి. పెళ్లికాని వారికి ఈ సమయంలో వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

కన్య రాశి

శుక్రుడి సంచారం వల్ల ఏర్పడిన మాళవ్య రాజయోగం కన్య రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు ఊహించని ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. మీ ప్రసంగానికి ప్రజలు ఆకర్షితులవుతారు. మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ సమయంలో వ్యాపారవేత్తలు డబ్బును తిరిగి పొందుతారు. అదృష్టవంతులు అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories