Vastu Tips: కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఈ విషయాలు మరిచిపోవద్దు.. అవేంటంటే..!

According To Vastu These Things Should Be Observed While Starting New Works Then The Work You Are Going To Do Will Be Successful
x

Vastu Tips: కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఈ విషయాలు మరిచిపోవద్దు.. అవేంటంటే..!

Highlights

Vastu Tips: మన దేశంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధన్యం ఉంటుంది. వాస్తు అనేది మానవ జీవితంలో చాలా ప్రభవం చూపుతుంది.

Vastu Tips: మన దేశంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధన్యం ఉంటుంది. వాస్తు అనేది మానవ జీవితంలో చాలా ప్రభవం చూపుతుంది. అందుకే చాలా మంది వాస్తును విశ్వసిస్తారు. ఏ పని మొదలుపెట్టినా వాస్తు ప్రకారం మొదలుపెడుతారు. అప్పుడే వారు విజయం సాధిస్తారు. కానీ కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయోగాలు చేసినా విజయం సాధించలేరు. కారణం వాస్తు దోశమే. ఏదైనా కొత్త పని కానీ వ్యాపారం కానీ మొదలుపెట్టేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మీరు యజమాని అయితే

మీరు ప్రారంభించే పనికి మీరు అధిపతి లేదా బాస్ అయితే మీరు కూర్చునే దిశ చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. యజమాని ఎల్లప్పుడూ నైరుతి దిశలో కూర్చోవాలి. ఇది పనిలో స్థిరత్వం విజయాన్ని తెస్తుంది.

ఫిష్ అక్వేరియం

మీరు పని ప్రదేశంలో తప్పనిసరిగా వాటర్ ఫౌంటెన్ లేదా ఫిష్ అక్వేరియం ఏర్పాటు చేసుకోవాలి. దానిని ఈశాన్య దిశలో నాటాలి. చేపల అక్వేరియం ఉంచినట్లయితే పనిలో పురోగతిని తెస్తుంది.

కొత్త పనిని ప్రారంభించేటప్పుడు

కొత్త పనిని ప్రారంభించేటప్పుడు లేదా కొత్త ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మీ ముఖం ఉత్తరం వైపు ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల పనిలో పురోగతి ఉంటుంది. ఉత్తర దిశలో డబ్బు లావాదేవీలు శుభప్రదంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ దిశ కుబేరుని దిశగా చెబుతారు.

కుర్చీ, టేబుల్

మీ కార్యాలయంలో లేదా పని ప్రదేశంలో అన్ని కుర్చీలు శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి. కొన్నిసార్లు టీ-కాఫీ మరకలు టేబుల్‌పై ఉంటాయి. మీరు వెంటనే ఈ మరకలను శుభ్రం చేయాలి. మురికి కుర్చీలు, బల్లలు నెగిటివ్‌ను సృష్టిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories