తాడేపల్లికి చేరిన రాజమండ్రి పంచాయితీ.. వైసీపీ అధిష్టానం సీరియస్..

YV Subba Reddy to Meet With Margani Bharat and Jakkampudi Raja
x

తాడేపల్లికి చేరిన రాజమండ్రి పంచాయితీ.. వైసీపీ అధిష్టానం సీరియస్..

Highlights

Margani Bharat: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య చోటు చేసుకున్న విభేదాలను వైసీపీ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

Margani Bharat: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య చోటు చేసుకున్న విభేదాలను వైసీపీ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు మార్గాని భరత్, జక్కంపూడి రాజాలు తాడేపల్లికి రావాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు పరస్పర విమర్శలు చేసుకొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీ దిగడాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తప్పుబట్టారు. పార్టీకి నష్టం చేసేలా మార్గాని భరత్ వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

జక్కంపూడి రాజా వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అదే స్థాయిలో కౌంటరిచ్చారు. పార్టీకి నష్టం చేసే విధంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని ప్రకటించారు. పార్టీకి నష్టం చేసేలా ఎవరు వ్యవహరిస్తున్నారో తనకు తెలుసున్నారు. కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకొందని వైసీపీ నాయకత్వం గుర్తించింది. ఈ ఇద్దరి మధ్య సర్ధుబాటు చేయాలని భావించింది.

వైసీపీ తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి మార్గాని భరత్, జక్కంపూడి రాజాలకు తాడేపల్లి రావాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఇద్దరు నేతలు తాడేపల్లికి వెళ్లే అవకాశం ఉంది. తొలుత ఇద్దరు నేతల మధ్య చోటు చేసుకొన్న అభిప్రాయబేధాలపై వైవీ సుబ్బారెడ్డి చర్చించనున్నారు. అవసరమైతే ఈ ఇద్దరిని జగన్ వద్దకు వైవీ సుబ్బారెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories