YV Subba Reddy: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టీటీడీ.. ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలపై రాయితీ

YV Subba reddy Revealed that Electrical Two-wheelers will be Given to TTD Employees at a Discount
x

YV Subba Reddy: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టీటీడీ.. ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలపై రాయితీ

Highlights

*నవంబర్ 1 నుంచి సర్వదర్శనం, ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తాం - టీటీడీ చైర్మన్

YV Subba Reddy: నవంబర్ 1 నుంచి సర్వదర్శనం, ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తామని, డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శనంలో టికెట్ల సమయంలోనూ మార్పులు చేశామని వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల కోసం 54 లక్షలతో నిర్మించిన ద్విచక్ర వాహనాల పార్కింగ్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులు అదే సమయంలో ఉంటారనే సూచనతో కొద్ది మార్పులు చేశామన్నారాయన ఉదయం 8 గంటల నుంచి 8.30 మధ్య బ్రేక్ దర్శనం ఉంటుందని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం గురించి సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, గతంలో ఇచ్చిన హామీ మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించామని చెప్పారాయన.. టీటీడీకి దాతలు ఇచ్చిన 100 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలను ఉద్యోగులకు రాయితీపై ఇస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories