ఆకస్మికంగా తనిఖీ చేసిన టీటీటీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఆ కాంట్రాక్టు రద్దు...

YV Subba Reddy Checking TTD Godown due to Complaints on Tirumala Prasadam | Live News
x

ఆకస్మికంగా తనిఖీ చేసిన టీటీటీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఆ కాంట్రాక్టు రద్దు...

Highlights

YV Subba Reddy: ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో సరుకుల గోడౌన్ లో తనిఖీలు...

YV Subba Reddy: టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో సరుకుల గోడౌన్ లో తనిఖీలు నిర్వహించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి...తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి ఉపయోగించే పదార్థాల నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత లేని జీడిపప్పు సరఫరా చేసిన టెండర్ ను రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

యాలకుల నాణ్యత పరిశీలనకు ల్యాబ్ కు పంపించాలని సూచించారు. ఆవు నెయ్యి నాణ్యతపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత లేదని ఆసహనం వ్యక్తం చేశారు. సరుకులు టీటీడీ ల్యాబ్‌లో పరీక్షించడంతో పాటు, సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్‌కు కూడా పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి ఆక్మస్మికంగా తనిఖీ చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు సిద్దం చేసిన జీడిపప్పును స్వయంగా పరిశీలించారు.

మూడు కంపెనీల జీడిపప్పు సరఫరా చేస్తుండగా ఒక కంపెనీ సరఫరా చేసిన జీడిపప్పులో దుమ్ము, విరిగి పోయినవి చాలా ఎక్కువ శాతం ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన రెండు కంపెనీలు సరఫరా చేసిన జీడిపప్పు టెండర్ నిబంధన మేరకు నాణ్యతగా ఉన్నట్లు గుర్తించారు. నాణ్యత లేని జీడిపప్పు సరఫరా చేసిన సంస్థ కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత యాలకులు మూట విప్పించి అవి స్పెసిఫికేషన్స్ మేరకు ఉన్నాలా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వాసన బాగా రావడం లేదని వీటిని ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి పంపాలని ఆదేశించారు. అదే విధంగా ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యి డబ్బా తెరిపించి పరిశీలించారు. నెయ్యి నాణ్యత లేదని అసహనం వ్యక్తం చేశారు. సరుకులు టీటీడీ ల్యాబ్ లో పరీక్షించడంతో పాటు, సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ కు కూడా పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories