Yuvagalam Vijayotsava Sabha: నేడు యువగళం విజయోత్సవ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

Yuvagalam Vijayotsava Sabha In Vizianagaram District
x

Yuvagalam Vijayotsava Sabha: నేడు యువగళం విజయోత్సవ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

Highlights

Yuvagalam Vijayotsava Sabha: భోగాపురం పోలిపల్లి వద్ద టీడీపీ భారీ బహిరంగ సభ

Yuvagalam Vijayotsava Sabha: ఏపీలో వైసీపీని గద్దె దించడమే టార్గెట్‌గా చేపట్టిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా యువగళం, నవశకం పేరిట టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. లోకేశ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు. 200 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 6 లక్షల మందికి సరిపోయే గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కాగా మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ప్రారంభంకానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories