డ్రగ్స్ మాఫియా నడిపిన వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?:వైఎస్ఆర్ సీపీ

డ్రగ్స్ మాఫియా నడిపిన వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?:వైఎస్ఆర్ సీపీ
x

 డ్రగ్స్ మాఫియా నడిపిన వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?:వైఎస్ఆర్ సీపీ

Highlights

మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియా నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా అంటూ వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియలో ప్రశ్నించింది.

మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియా నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా అంటూ వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియలో ప్రశ్నించింది. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా వ్యవహరాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత... సాక్ష్యాలివిగో అంటూ ఆ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు.

అక్టోబర్ 24న కీలక విషయాలను బయటపెడతానని వైఎస్ఆర్ సీపీ ప్రకటించింది. ఆ సంచలన వాస్తవాలు ఇవేనా అనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. ఓ మీడియా ఛానల్ అధినేతకు ఈ పదవిని తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించనుందని తెలుగుదేశం వర్గాల్లో సాగుతోంది. అయితే ఈ సమయంలో వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు పనిచేశారు. ప్రభుత్వం మారే సమయానికి కరుణాకర్ రెడ్డి ఛైర్మన్ గా ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే ఈ పదవిని ఓ మీడియా ఛానెల్ అధినేతకు ఈ పదవి ఇస్తారనే చర్చ కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్ సీపీ ఈ పోస్టు పెట్టిందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories