YSRCP Plenary 2022: తల్లి విజయమ్మతో కలిసి వచ్చిన జగన్

YSRCP Plenary 2022 Live Updates
x

జెండా వందనంతో ప్లీనరీ ప్రారంభించిన జగన్

Highlights

*వైసీపీ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్

YSRCP Plenary 2022: గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ ఘనంగా ప్రారంభించారు వైసీపీ అధినేత, సీఎం జగన్. తల్లి విజయమ్మతో కలిసి సీఎం జగన్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం పార్టీ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించి ప్లీనరీ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న వైసీపీ ప్లీనరీలో ఐదు తీర్మానాలను ఆమోదించనున్నారు. ఈ కీలకమైన ఐదు తీర్మానాలపై ప్రతినిధులు చర్చించి ఆమోదించనున్నారు.

బలహీన వర్గాలకు సాధికారిత, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలపై తీర్మానాలను ఆమోదించనున్నారు. మరో వైపు ఈ ప్లీనరీలోనే వైఎస్ జగన్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకొంటారు. అయితే పార్టీ నియమావళిలో మార్పులు చేర్పులపై కూడా ఈ ప్లీనరీలో చర్చించే అవకాశం లేకపోలేదు. వైసీపీ ప్లీనరీలో వైఎస్ జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా నియమించేలా మార్పులు చేస్తారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories