MP Raghurama Krishna Raju meets Defence Minister Rajnath Singh : స్వరం మార్చిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు

MP Raghurama Krishna Raju meets Defence Minister Rajnath Singh : స్వరం మార్చిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు
x
Highlights

MP Raghurama Krishna Raju meets Defence Minister Rajnath Singh: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఎంపీ రఘురామ కృష్ణంరాజు కలిశారు. రాజ్ నాథ్...

MP Raghurama Krishna Raju meets Defence Minister Rajnath Singh: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఎంపీ రఘురామ కృష్ణంరాజు కలిశారు. రాజ్ నాథ్ సింగ్ తో భేటీ తరువాత ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వరం మార్చారు. తనకు పార్టీకి మధ్య అగాధం సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తుందని తాను పార్టీని పల్లెత్తుమాట అనలేదని వ్యాఖ్యానించారు. తాను నేతృత్వం వహిస్తున్న పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన సలహాలు , సూచనల కోసం కేంద్రమంత్రిని కాలిశానని స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన అన్నారు. బిజెపిలో చేరే అవకాశాలు లేవని, ఒక ఎంపిగా కేంద్ర మంత్రులను కలిసి నియోజకవర్గ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

తనకు రక్షణ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తామే భద్రత కల్పిస్తామని అడ్డం పడుతుందని తెలిసిందన్నారు. తన రక్షణ విషయంలో మీడియాకు ఉన్న చొరవ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.."నా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి ఊడగొట్టాలని కొంతమంది చూస్తున్నారు, దానికి ఇంకా మూడు నెలల సమయం ఉందని..పార్టీకి నాకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు, పార్టీకి ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు, పార్టీ చాలా పటిష్టంగా ఉంది. పార్టీకి,పార్టీ అధ్యక్షుడికి సలహాలు సూచనలు ఇవ్వలేదు. ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసాను. తిరుపతి భూముల విషయం, ఇసుక విషయంలో సూచనలు చేసాను. సాండ్ కార్పొరేషన్ ఏర్పాటు అయిందంటే అక్కడ తప్పు జరుగుతుందనేగా అర్థం అని అన్నారు. పార్టీలో భాద్యత గల కార్యకర్తగా పార్టీకి ప్రజలు దూరం కాకూడదని ,పార్టీ మరో 25 సంవత్సరాలు రూలింగ్ లో ఉండాలన్న అభిప్రాయంతో తాను ప్రభుత్వానికి సూచనలు చేసానని చెప్పారు. నాపై ఎందుకు అనర్హత ఫిర్యాదు చేశారో అర్థం కావడంలేదని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories