Raghu Ramakrishnam Raju on Three Capitals: రాజధాని విషయంలో రిఫరెండం పెట్టాలి.. రఘురామ కృష్ణంరాజు

Raghu Ramakrishnam Raju on Three Capitals: రాజధాని విషయంలో రిఫరెండం పెట్టాలి.. రఘురామ కృష్ణంరాజు
x
Highlights

Raghu Ramakrishnam Raju on Three Capitals: మూడు రాజదానుల ఆమోదంపై నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు స్పందించారు.

Raghu Ramakrishnam Raju on Three Capitals: మూడు రాజదానుల ఆమోదంపై నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు స్పందించారు. మూడు రాజధానుల విషయంలో వైఎస్సార్ మేనిఫెస్టో లో వ్యతిరేకం అని ఎక్కడ పెట్టలేదు అని తాను అసెంబ్లీ లో అమరావతి రాజధాని కి వ్యతిరేకం కాదు, నేను ఇక్కడ ఇళ్లు కట్టుకున్నాను అని ప్రకటించారు. ఎంతోమంది రీతులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు అమరావతి రాజధాని కి జగన్ వ్యతిరేకం కాదని ప్రజలు భావించడం వల్ల ఆయనకు అద్వితీయమైన విజయం ఇచ్చారు. అమరావతి ప్రజలందరూ జగన్ నమ్మారు.

అయితే ప్రస్తుతం రఘురామా కృష్ణంరాజు మాత్రం రాజధాని విషయంలో రిఫరెండం పెట్టాలిఅని సూచించారు. ముందుగా ప్రజల అభిప్రాయం తెసుకుని రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవాలి, అదేవిదంగా సొంత పార్టీ శాసన సభ్యులకు రహస్యంగా రిఫరెండం పెట్టి 150 మందిలో మూడు రాజధానులకు ఎంతమంది అనుకూలమో తెలుసుకోవాలి. అంతేకానీ లిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా ను చూసి మూడు రాజధానుల విషయాన్ని తెరపైకి తేవటం సరికాదన్నారు. ఇంకా అయన ఏమన్నారో ఆయన ఏమ్మన్నారో ఆయన మాటల్లోనే...

విశాఖపట్నం వెళ్లిపోవాలని నిర్ణయించుకుని రాజధాని తరలింపు విషయాన్ని మొదలుపెట్టారు.

♦ ఒక భట్రాజులాంటి అధికారిని పక్కన పెట్టుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

♦ ఆ అధికారి వ్యవహారశైలి వల్ల తోటి అధికారులు ఇబ్బంది పడుతున్నారు.

♦ అతను నా విషయంతో పాటు అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటున్నాడు.

♦ ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత అభిప్రాయాలకు చోటు లేదు.

♦ రాజధాని లో భూములు ఇచ్చిన రైతులలో బీసీలు, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు.

♦ రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 6 చదివితే అర్ధం అవుతుంది.

♦ దాని ప్రకారం కేంద్రం నియమించిన కమిటీకే రాజధానిని ఎక్కడ అని సూచించే అధికారం ఉంచింది.

♦ ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు.

♦ జగన్ ప్రధాని అయితే రాష్ట్రానికి ఒక దేశ రాజధాని పెడతారు.

అందరు సీఎం నిర్ణయాన్ని ప్రశ్నించకుండా గొర్రెల లాగా తలఊపుతారా? ప్రశ్నించే ధైర్యం లేదా? బక్రీద్ గొర్రెలలాగా బలవుతారా? కర్నూలు లో హైకోర్టు పెడితే రాయలసీమ ప్రజలకు ఏం ప్రయోజనం. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నం కు వెళ్లాలంటే ఎంత దూరం వెళ్లాలో రాయలసీమ ప్రజలు ఆలోచించుకోవాలి. రాజధానిని మార్చినంత సులువుగా నా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం సాధ్యం కాదు. అంటూ రఘురామా కృష్ణం రాజు ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించారు. అంతే కాదు సొంత పార్టీ పైనే రఘురామా కృష్ణం రాజు ఈ విధంగా మాట్లాడటంపై పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories