CM Jagan: మహిళా సాధికారిత నినాదం కాదు.. మా విధానం - జగన్

YSR CM Jagan Released Zero Investment Funds
x
వైఎస్ జగన్ (ఫొటో ట్విట్టర్)
Highlights

CM Jagan Mohan Reddy: ఏపీలో మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం జగన్‌ అన్నారు.

CM Jagan Mohan Reddy: ఏపీలో మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం జగన్‌ అన్నారు. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద వరుసగా రెండో ఏడాది కూడా డ్వాక్రా సంఘాలకు నగదు జమ చేశారు‌. ఆన్‌లైన్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో చెల్లింపులు జరిపారు. 9లక్షల 34వేల డ్వాక్రా గ్రూపుల ద్వారా కోటి 2వేల మంది మహిళలు లబ్ది పొందనున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, ''మహిళలకు అన్ని విధాలుగా అండగా మా ప్రభుత్వం నిలబడింది. మహిళా సాధికారితను ఆచరణలోకి తీసుకురాగలిగాం. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నాం. డ్వాక్రా సంఘాల అప్పుపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లిసున్నాం. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళా సాధికారిత నినాదం కాదు.. మా విధానమని'' అన్నారు.

అలాగే మహిళలకు 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చేలా చట్టం చేశామని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories