YS Sharmila: 'నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా... జగన్ చేస్తారా? కన్నీళ్ళు పెట్టుకున్న షర్మిల

YS Sharmila
x

YS Sharmila

Highlights

YS Sharmila: ఇది నిజం కాదని వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి చెప్పగలరా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

YS Sharmila: నలుగురు మనవళ్లకు సమాన ఆస్తి పంచాలనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయం... ఈ విషయాన్ని నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా... ఇది నిజం కాదని వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి చెప్పగలరా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

శనివారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆస్తుల వివాదంలో శుక్రవారం వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటరిచ్చారు. ఒకానొక సమయంలో ఆమె మీడియా సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి అని ఆమె విమర్శించారు. సుబ్బారెడ్డి, ఆయన కొడుకు ఆర్ధికంగా లాభపడ్డారు. సుబ్బారెడ్డే కాదు.. విజయసాయిరెడ్డి కూడా ఇలానే మాట్లాడొచ్చని ఆమె చెప్పారు. జగన్ పక్కన వాళ్లు ఉన్నారని తెలిసి కూడా నిన్న రాసిన లేఖలో వాళ్ల పేర్లు ప్రస్తావించినట్టు ఆమె వివరించారు. నేను చెప్పిన విషయాలు నిజమని ప్రమాణం చేస్తా... మీరు చెబుతున్నది నిజమని ప్రమాణం చేయగలరా అని ఆయన వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నించారు.

భారతి ఎందుకు జైలుకు వెళ్లలేదు?

భారతి, జగతి పేరుతో సంస్థలు ఏర్పాటు చేశారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుమతి ఉందని చెబుతున్నారని... పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు మొత్తం వారివే ఎలా అవుతాయని ఆమె అడిగారు. జగన్ పేరున ఆస్తులున్నందునే ఆయన జైలుకు వెళ్లారని చెబుతున్నారు.. మరి భారతి పేరున ఆస్తులున్నాయి.. ఆమె ఎందుకు జైలుకు వెళ్లలేదని ఆమె ప్రశ్నించారు.

ఎంఒయూ ఎందుకు రాసుకున్నారు?

ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఎంఓయూ రాసుకుంటారా? మీరు ఎంఓయూ రాశారంటేనే ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అర్ధం. ఎంఓయూ రాసుకొని ఇప్పుడేమో వాటిని రద్దు చేసుకుంటున్నామని కేసులు వేస్తారా ఇదేం న్యాయమని ఆమె అడిగారు. అందరి ఇళ్లలో ఇలాంటి గొడవలు జరుగుతాయని చెప్పడం చూస్తే ఈ విషయాన్ని చాలా సులభంగా తీసుకొంటున్నారని అర్థమైందన్నారు. ఇలా సుబ్బారెడ్డి బాబాయ్ మాట్లాడం తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె చెప్పారు. ఆయన మాటలు వింటూనే కన్నీళ్లు ఆగడం లేదని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

కన్నతల్లిని కోర్టుకు లాగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా?

కన్నతల్లిని కోర్టుకు లాగడం ఘర్ ఘర్ కీ కహానీ ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు.కన్నతల్లిని కోర్టుకు లాగే వ్యక్తి ఎవరైనా ఉంటారా అని ఆమె అన్నారు. జగన్ కోసం నేను, అమ్మ చాలా కష్టపడ్డామని చెప్పారు.నేను 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని ఆమె గుర్తు చేశారు.

నా కోసం జగన్ ఏం చేశారు?

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 151 సీట్లలో గెలిచింది. ఇది అఖండ విజయం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు.. ఆయన ఆశయం కోసం ఎంతో కష్టపడి, త్యాగాలు చేస్తే ఈ విజయం లభించిందని చెప్పారు. పార్టీ కోసం మా శక్తివంచన లేకుండా చేశామన్నారు. ఎన్నికల క్యాంపెయిన్ చేసిన తర్వాత రాత్రి పూట అమ్మ చాలా కష్టాలు పడిందని ఆమె వివరించారు. పాదయాత్రకే కాదు... సూర్యుడి వరకు వెళ్లాలని చెప్పినా కూడా వెళ్తానని చెప్పారు. నేను ఏం తప్పు చేశానో చెప్పాలని ఆమె వైఎస్ఆర్ సీపీని ప్రశ్నించారు. జగన్ నాకు ఒక్క మేలైనా చేశారా అని ఆమె అడిగారు? చెల్లి కోసం జన్మలో ఇది చేశానని ఒక్కటైనా చెప్పగలరా ? నాకు, నా పిల్లకు జగన్ అన్యాయం చేస్తున్నారనేది పచ్చి నిజమన్నారు.

Also Read: YV Subba Reddy: 'షర్మిలా.. మీ పోరాటం ఆస్తుల కోసమా, జగన్ బెయిల్ రద్దు కోసమా?'

Show Full Article
Print Article
Next Story
More Stories