YS Sharmila: అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశారు

YS Sharmila Fire on Jagan Over Adani Issue
x

YS Sharmila: అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశారు

Highlights

YS Sharmila: గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఏపీ పరువు తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల విమర్శించారు.

YS Sharmila: గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఏపీ పరువు తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల విమర్శించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడారు. అమెరికాలో గౌతమ్ అదానీ బండారం బయటపడడం దేశానికే అవమానమాన్నారు. అమెరికా ఏజెన్సీలు గౌతమ్ అదానీ, మరికొందరిపై అభియోగాలు మోపాయి. గౌతమ్ అదానీ భారత్‌లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారని.. కొన్ని రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్టు వెల్లడైందన్నారు.

ఏపీ ఉన్నతాధికారికి రూ.1.750 కోట్లు లంచం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ మొత్తం లంచం జగన్‌కు ఇచ్చినట్టు స్పష్టంగా వెల్లడైందని షర్మిల స్పష్టం చేశారు. జగన్ అమెరికాకు డైరెక్ట్ ఇన్‌వాల్వ్‌మెంట్ లేనందునే.. ఆరోపణల్లో జగన్ పేరును నేరుగా అమెరికా ప్రస్తావించలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories