YS Sharmila: ప్రధాని మోదీకి ఇచ్చిన హామీ నెరవేర్చారు సరే.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మాటేంటి?
YS Sharmila: ట్విటర్ వేదికగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila: ట్విటర్ వేదికగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 లోక్‌సభ సీట్లకు గాను 21 సీట్లు గెలిచి ప్రధాని మోదీకి ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు గర్వంగా ఉందన్న మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షర్మిల కౌంటర్ వేశారు. మోడీకి మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు గర్వపడుతున్నారని.. కానీ ప్రజలకు నెరవేర్చని హామీల గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. మీ సూపర్ సిక్క్ వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు.
ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అయినా... ప్రతి వారం ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని విమర్శించారు. మోడీ ఏపీకి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టులకు అతిగతి లేదన్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అనే టీవీ షోలో మిమ్మల్ని చూడటం చాలా బాగుంది కానీ... ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంపై మీ ఉద్దేశఆలను స్పష్టంగా మాట్లాడాలని ఆశిస్తున్నా అని షర్మిల ట్వీట్ చేశారు.
Dear @NaraLokesh garu,
— YS Sharmila (@realyssharmila) October 16, 2024
You take great pride in the fulfilment of your promise made to Modi ji, but you haven’t spoken a word about the unfulfilled promises to the people of AP. Your “Super6” promises still remain unfulfilled.
It is also shameful that even after four months of… pic.twitter.com/6Bk413Ht8K
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire