YS Rajasekhar Reddy Jayanti: ఇడుపుల పాయలో షర్మిల ప్రార్థనలు

YS Sharmila at Idupulapaaya
x

YS Sharmila at Idupulapaaya

Highlights

YS Rajasekhar Reddy Jayanti: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి(72)జయంతి సందర్భంగా కడప జల్లా ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల...

YS Rajasekhar Reddy Jayanti: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి(72)జయంతి సందర్భంగా కడప జల్లా ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు. షర్మిల భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ, వైఎస్ వివేకా కుమార్తె సునీత తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. షర్మిల తెలంగాణ లో నేడు వైస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పార్టి (వైఎస్ ఆర్ టీపీ) ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె కడప నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు.

పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ కేంద్రానికి చేరుకుంటారు. వైదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ స్థాపన లక్ష్యాలు, ఎజెండాపై షర్మిల ప్రసంగించనున్నట్లు సమాచారం.

జగన్ అభీష్టానికి వ్యతిరేకంగా షర్మిల పార్టీ పెడుతున్నారనిదానిపై ఇప్పటికే విజయమ్మ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య మాటలు కూడా లేవు. ఒక వేళ షర్మిల పార్టీకి మద్దతు తెలిపితే.. జగన్మోహన్ రెడ్డి వద్ద ఆదరణ దొరకడం కష్టమే. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి నైజం ప్రకారం.. ఆయన వ్యతిరేకులతో కలిసేవారిని ఎప్పుడూ ఆదరించరు. అందుకే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఎవరు ఎటు వైపు ఉన్నారన్న చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories