YS Rajasekhar Reddy: జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి

YS Rajasekhar Reddy Birth Anniversary On July 8
x

YS Rajasekhar Reddy: జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి 

Highlights

YS Rajasekhar Reddy: ఇడుపులపాయకు రానున్న రాహుల్, సోనియా

YS Rajasekhara Reddy: వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ కార్యక్రమం కూడా అక్కడా ఇక్కడా కాకుండా ఏకంగా ఇడుపుల పాయలోనే జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ భారీ వ్యూహంతో రంగంలోకి దిగుతుందంటున్నారు.

జులై 8న వైఎస్ జ‌యంతి సంద‌ర్భంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు క‌డ‌పజిల్లాలోని ఇడుపుల‌పాయ‌కు రానున్నార‌ని, అక్కడ వైఎస్ స‌మాధి వ‌ద్ద నివాళులు ఆర్పించ‌నున్నార‌ని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వారి సమక్షంలోనే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జ‌రిగితే వైఎస్ కుటుంబం మ‌ర‌లా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుంద‌ని అనుకోవ‌చ్చు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ కొంత‌మేర బ‌లంగా ఉన్నప్పటికీ, ఏపీలో ఆ పార్టీ పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డింది. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఒక్క సీటును కూడా ఆ పార్టీ గెలుచుకోలేక‌పోయింది. మ‌రి వైఎస్ కుటుంబం ఆ పార్టీతో క‌లిస్తే కాంగ్రెస్‌కు మ‌ళ్లి పున‌ర్వైభ‌వం సాధ్యమవుతుందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories