CM Jagan: దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ ఇది.. ఈ స్కామ్‌లో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోంది..

YS Jagan Speech About Skill Development Scam In Assembly
x

YS Jagan: స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోంది 

Highlights

YS Jagan: దేశచరిత్రలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ అతి పెద్దది

YS Jagan: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సీఎం జగన్ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. దేశచరిత్రలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ అతి పెద్దదన్నారు. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోందని జగన్ ఆరోపించారు. ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్‌గా జగన్ చెప్పుకొచ్చారు. విదేశీ లాటరీ తరహాలోనే ఈ స్కిల్‌ స్కామ్‌ను నడిపించారని ఆరోపించారు. దీంతో 371 కోట్ల రూపాయల జనం సొమ్మును మాయం చేశారన్నారు.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కీమ్‌ ఖర్చు మొత్తం 3 వేల 356 కోట్లు అని చెప్పారు సీఎం జగన్. ఇందులో ప్రభుత్వం వాటా 10శాతం కాగా.. 90శాతం సీమెన్స్ కంపెనీ భరిస్తుందని చెప్పారన్నారు. అయితే ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీ 3వేల కోట్ల రూపాయలను గ్రాంట్‌గా ఇస్తుందా? అని ప్రశ్నించారు. దీనిపై ఎవరూ అడగలేదని.. చివరికి దత్తపుత్రుడు కూడా ప్రశ్నించలేదని సీఎం జగన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories