నేడు డల్లాస్‌లో భారీ సభ.. సీఎం జగన్ ప్రసంగం

నేడు డల్లాస్‌లో భారీ సభ.. సీఎం జగన్ ప్రసంగం
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నిన్న అమెరికా గడ్డపై అడుగుపెట్టారు. వాషిం‍గ్టన్‌ చేరుకున్న జగన్‌కు ఎన్‌ఆర్‌ఐలు.. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా, నీల్‌కాంత్‌ అవ్హద్‌లు సీఎం జగన్‌ను కలిసి ఆహ్వానించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నిన్న అమెరికా గడ్డపై అడుగుపెట్టారు. వాషిం‍గ్టన్‌ చేరుకున్న జగన్‌కు ఎన్‌ఆర్‌ఐలు.. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా, నీల్‌కాంత్‌ అవ్హద్‌లు సీఎం జగన్‌ను కలిసి ఆహ్వానించారు. అనంతరం అమెరికా-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సమావేశమైన జగన్... భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొన్నారు. నేడు డల్లాస్ చేరుకోనున్న ఆయన అక్కడి కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు జరిగే సభకు హాజరవుతారు. నార్త్‌ అమెరికాలో తెలుగు వాళ్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

18న మళ్లీ వాషింగ్టన్‌ చేరుకోనున్న జగన్... వ్యాపార సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఈనెల 19, 20, 21న తన వ్యక్తిగత పనులతో బిజీగా గడపనున్న సీఎం జగన్.. 22న మధ్యాహ్నం షికాగోలో మరికొన్ని సంస్థల ప్రతినిధులను కలుస్తారు.. తర్వాత అదే రోజు రాత్రి 8:30 గంటలకు అమెరికా నుంచి రాష్ట్రానికి తిరిగి బయల్దేరతారు. మరోవైపు అమెరికా పర్యటనలో మూడు రోజులు వ్యక్తిగత పనులు ఉండటంతో జగన్‌.. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా ఖర్చులు సొంతగా భరిస్తున్నారని సీఎం కార్యాలయం తెలిపింది. జగన్ తన చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పలు అధికార, అనధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు జగన్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories