Nellore: సెంట్రల్‌ జైల్లో పిన్నెల్లితో జగన్ ములాఖత్..

YS Jagan Press Meet at Nellore Central Jail After Meeting Pinnelli Ramakrishna Reddy
x

Nellore: సెంట్రల్‌ జైల్లో పిన్నెల్లితో జగన్ ములాఖత్..

Highlights

YS Jagan: నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ ములాఖత్ అయ్యారు.

YS Jagan: నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ ములాఖత్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విషయంలోనే..ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. పిన్నెల్లికి మాజీ సీఎం జగన్ ధైర్యం చెప్పారు. జగన్ నెల్లూరు జైలుకు చేరుకున్న సమయంలో అభిమానులు,కార్యకర్తలు జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ..‘పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు. పిన్నెల్లిపై హత్యానేరం మోపారు. కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న ఘటన జరిగితే.. మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిజంగా దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు?. ఒక్క పిన్నెల్లిపైనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలానే దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటివి వెంటనే ఆపాలని హెచ్చరిస్తున్నా అంటూ కామెంట్స్‌ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories